కోడలు, కూతుళ్ళతో చిరు

Chiranjeevi with his daughters and daughter-inlaw

10:43 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Chiranjeevi with his daughters and daughter-inlaw

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ఏంటో అని అందరికీ తెలిసిందే. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో అనువాదిస్తున్నారు. అందులో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని మార్చి లేదా ఏప్రిల్‌లో సెట్స్‌ పైకి తీసుకువెళ్ళే అవకాశాలున్నాయి. అన్నీ కుదిరితే మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తేజ్‌ పుట్టినరోజు మార్చి 27న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా చిరంజీవి తన కోడలు ఉపాసన, కూతుళ్ళు సుస్మితా, శ్రీజ లతో సరదాగా ఇలా ఫోజిచ్చారు. ఈ ఫోటోలో చిరు లుక్‌ అదిరిపోతుంది. ఈ ఫోటోని ఉపాసన తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తుంది. మీరు కూడా ఒకలుక్‌ వెయ్యండి.

English summary

Meagastar Chiranjeevi latest still with his daughters Sushmitha, Srija and daughter-inlaw Upasana.