23 నుంచి మెగాషూట్

Chiru 150 movie shooting from 23rd june

01:04 PM ON 21st June, 2016 By Mirchi Vilas

Chiru 150 movie shooting from 23rd june

ఎప్పుడా ఎప్పుడా అని అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు షూటింగ్ డేట్ బయటికొచ్చేసింది. ఈ నెల 23 నుంచి షూటింగ్ కు శ్రీకారం అంటున్నారు. అదే రోజు నుంచి చిరు కూడా షూట్ లో పాల్గొంటాడట.. 24న హైదరాబాద్ ఫ్లై ఓవర్ మీద నైట్ షూటింగ్ ఉంటుందని చెబుతున్నారు. చిన్న చిన్న గ్యాప్ లు మినహా కంటిన్యూగా చిత్రీకరణలో యూనిట్ బిజీగా ఉంటుందట. నిజానికి ఈ మూవీలో హీరోయిన్ రోల్ కు అంత ప్రాధాన్యం ఉండదు గనుక ఆ విషయాన్ని మేకర్స్ పట్టించుకోవడం లేదు. అయితే త్వరలోనే దీని పై కూడా యూనిట్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మొత్తానికి మెగా స్టార్ చిత్రం సెట్స్ మీదికి రావడానికి ముహూర్తం కన్ఫర్మ్ కావడంతో అభిమానులు అప్పుడే ఆనందంలో మునిగితేలుతున్నారు.

English summary

Chiru 150 movie shooting from 23rd june