కత్తిలాంటోడు ఫస్ట్ లుక్

Chiru 150th Film First Look

09:41 AM ON 27th April, 2016 By Mirchi Vilas

Chiru 150th Film First Look

సినిమా వేగం పెరిగింది. క్షణాల్లో ఏదైనా నెట్ లో వైరల్ అవుతోంది. అది నిజమే కాదో తెలియక పోయినా అందరినీ అలరిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు ఫస్ట్ లుక్ అంటూ ఓ పోస్టర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే, ఇది అఫీషియల్ పోస్టరా లేక ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్ అనేదాని పై క్లారిటీ రాలేదు. అయితే, ఈ పోస్టర్ తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన 'కత్తి' ఒరిజినల్ వర్షన్ లో వచ్చిన డిజిటల్ మోషన్ పోస్టర్ ని పోలి ఉందంటూ కొంతమంది అప్పడే పోల్చేస్తున్నారు. దీని సంగతి పక్కనపెడితే, తన 150వ సినిమాతో పొలిటికల్ రీలాంచ్ అవ్వాలని చిరంజీవి భావిస్తున్నారనే ఊహాగానాలకు ఈ పోస్టర్ ఊతమిస్తుండటం నిజంగా విశేషమే.

ఇవి కూడా చదవండి:ఫేస్బుక్ ప్రియుడు కోసం పోలీసు భర్తనే చంపేసింది!

ఇవి కూడా చదవండి:ప్రభాస్ పెళ్ళి ఆమెతోనేనట

English summary

Here is the first look of Mega Star Chiranjeevi's 150th film Kathilantodu movie . This movie was going to be direct by V.V.Vinayak and Mega Power Star Ram Charan was going to be produce this movie.