చిరు 150వ సినిమాకు మరో గండం

Chiru 150th film in trouble

10:38 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Chiru 150th film in trouble

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చిరు 150 సినిమాగా తమిళ సినిమా 'కత్తి' ని రీమేక్‌ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. మురుగదాస్‌ రాసిన ఈ కధను మొదట తమిళంలో తీసారు. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో ఈ సినిమాని తెలుగులో కూడా చిత్రీకరించాలని లైకా ప్రొడక్షన్‌ వారు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కొనసాగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన పనులని చిరు కుమారుడు రామ్‌చరణ్‌ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా మొదలుపెట్టకుండానే ఇబ్బందుల్లో పడింది.

ఎన్‌. నరసింహారావు అనే రచయిత ఈ సినిమా కధ తనదే అని కథా హక్కుల వేదికను ఆశ్రయించాడు. ఈ విషయం పై కధాహక్కుల వేదిక చర్చలు జరిపింది. ఈ సినిమా నిర్మాణం పై ఆంక్షలు విధించింది. దీంతో నరసింహారావు వివాదం ఓ కొలిక్కి వచ్చే వరకు దర్శకుల సంఘం, సినీ కార్మికుల ఫెడరేషన్‌ చిరు 150వ సినిమాకు సహాయ నిరాకరణం చెయ్యాలని దర్శకుడు దాసరి నారాయణరావు తెలిపాడు. అయితే ఈ సమస్యలన్నీ ఎదుర్కుని చిరు 150వ సినిమా మొదలవుతుందో లేదో వేచి చూడాలి.

English summary

Chiru 150th film in trouble. Actually Chiru want to remake his 150th film tamil super hit movie Kathi. But N. Narasimha Rao told that this story is mine and without my permission anybody don't need to direct this story.