చిరు పిక్చర్ కి ముహూర్తం ఫిక్స్

Chiru 150th Film will Be start On April 29th

10:21 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Chiru 150th Film will Be start On April 29th

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు తీపి కబురు అందింది. అదేనండీ చిరంజీవి 150వ సినిమా సంగతి ... ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 29న క్లాప్ కొట్టుకోబోతున్నట్లు అధికారికంగా స్టేట్‌మెంట్ వచ్చేసింది. ఆరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో ఇన్నాళ్ళ దోబూచులాటకు తెరపడింది. తమిళంలో బ్లాక్ బస్టర్ 'కత్తి' సినిమా రీమేక్ చేస్తున్నారు. కత్తి స్టోరీ లైన్‌ని ఇటు చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగా.. అటు తెలుగు ఆడియన్స్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాడట దర్శకుడు వి.వి.వినాయ‌క్. ఈ ఫిల్మ్.. కొన్నాళ్ళుగా ప్రీ-ప్రొడక్షన్‌ పనుల్లో నిమగ్నమైంది. ఫైనల్‌గా వి.వి.వినాయ‌క్ చేసిన మార్పుల వల్ల చిరు సంతృప్తి వ్యక్తం చేశాడ‌ట‌. దీంతో ముహూర్తానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడట. మరోవైపు పవన్‌కల్యాణ్, అల్లుఅర్జున్ ఇందులో స్పెషల్‌గా కనిపిస్తున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం. రామ్‌చరణ్ నిర్మాతగా రానున్న ఈ చిత్రాన్ని మే నుంచి కంటిన్యూగా షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రారంభోత్సవాన్ని ఘనంగా చేయాలన్నది మెగా క్యాంప్ ముచ్చట పడుతోంది.

ఇవి కూడా చదవండి:

పేదల కళ్ళలో అనందం కోసం 26 వేల కోట్లను దొంగిలించాడు

పెళ్ళికూతురు ఏం అడిగిందో తెలుసా ..!

జగన్ ప్రాణాలు కాపాడిన హీరో శ్రీకాంత్

English summary

Megastar Chiranjeevi's 150th film was going to be start on April 29th and this was officially announced by the movie unit. Recently Director V.V.Vinayak said story to Chiranjeevi and chiru was so impressed with the story of V.V.Vinayak.