మొత్తానికి కత్తి కి రైట్ రైట్

Chiru 150th Movie Kathilantodu to Go On Sets

10:46 AM ON 13th June, 2016 By Mirchi Vilas

Chiru 150th Movie Kathilantodu to Go On Sets

అంటే ఏదో ఊహించుకుంటున్నారు. అదేం లేదు .. మెగా అభిమానులకు కూడా ఇది శుభవార్తే.. ఇంతకీ విషయం ఏమంటే, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం తమిళ రీమేక్ ‘కత్తిలాంటోడు’ ఎంచుకున్న సంగతి తెలిసింది. అయితే ఈ కథపై వివాదం రేగింది కూడా.. ఇప్పుడు అది కాస్తా సమసిపోయింది. ఈ కథ తనదేనని రచయిత నరసింహారావు కథారచయితల వేదికకి ఫిర్యాదు చేయడం, కత్తి మూవీ రిలీజ్ కు ముందే తన స్టోరీని తెలుగు రచయితల సంఘంలో రిజిస్టర్ చేశానంటూ అందుకు ఆధారాలు చూపడం జరిగిపోయాయి. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావును కూడా కలిసి నరసింహారావు తన వాదన వినిపించడంతో అతడికి న్యాయం జరిగేవరకు చిరు సినిమా షూటింగ్ కు హాజరు కావద్దని యూనిట్ కు ఆయన సూచించారు.

దాంతో నరసింహారావుతో మెగా యూనిట్ సంప్రదింపులు జరిపింది. చివరకు ఈ చర్చలు ఫలప్రదమయ్యాయట. రచయిత నరసింహారావు పేరును మూవీ టైటిల్స్ లో వేస్తామని, 40 లక్షల పారితోషికం ఇస్తామని యూనిట్ హామీ ఇవ్వడంతో ఆయన సంతృప్తి చెంది.. ఇక ఈ వివాదం పరిష్కారమైనట్టే అని ప్రకటించాడట. మొత్తానికి మెగాస్టార్ 150వ మూవీకి బాలారిష్టాలు తొలగిపోవడంతో షూటింగ్ కి రైట్ రైట్ అంటూ యూనిట్ సందడి చేస్తోందట.

ఇది కూడా చూడండి: 'శాతకర్ణి'పై రాజమౌళి ఏమన్నాడంటే ..

ఇది కూడా చూడండి: ఇది అందరి దౌర్భాగ్యం..దర్శకరత్న షాకింగ్ కామెంట్స్

ఇది కూడా చూడండి: 'ఉడ్తా పంజాబ్' కు 13 కట్స్

English summary

All problems are cleared. Chiranjeevi 150th Movie Kathilantodu to Go On Sets.