మెగా మూవీ కి మళ్ళీ బ్రేక్ ?

Chiru 150th Movie Shooting was going to start on July

10:07 AM ON 14th May, 2016 By Mirchi Vilas

Chiru 150th Movie Shooting was going to start on July

అవునా, పాపం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కు మళ్ళీ అడ్డంకి ఏర్పడిందా? రెండేళ్ల క్రితమే చిరు తన 150వ సినిమా గురించి అనౌన్స్ చేసినా కథలు ఎంపిక, డైరెక్టర్ విషయంలో చాలా సమయం తీసుకున్నాడు. మొత్తానికి తమిళ సూపర్ హిట్ మూవి ‘కత్తి’ చిత్రాన్ని రిమేక్ చేసేందుకు రెడీ అయి డైరెక్టర్ గా వివి వినాయక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా..చిరు ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని కథలో చాలా మార్పులు చేశారు. ఎట్టకేలకు మొదలైందిలే.. అనుకున్న చిరంజీవి 150వ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా టైముందట.

ఇవి కూడా చదవండి:రూమ్ కి అమ్మాయిలని పంపిస్తే బ్యాంకు లోన్ ఇచ్చేస్తారట

గత నెలలో చిత్రం అధికారికంగా ప్రారంభమైన సంగతి తెల్సిందే. పూజాకార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక రేపే మాపో సెట్స్ మీదకు వెళ్తుందిలే అనుకుంటే ఇప్పటికే పక్షం రోజులు పూర్తయినా ఆదిశగా పని స్టార్ట్ కాలేదు. ఇప్పట్లో సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా కూడా కనిపించడంలేదు. జూన్ లాస్ట్ వీక్ లేదా జులైలో ‘కత్తిలాంటోడు’ సెట్స్‌ మీదకి వెళ్తాడని టాలీవుడ్ టాక్. వినాయక్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులపై ఇంకా కేర్ తీసుకుంటున్నారని ఇందుకే ఈ ఆలస్యమని అంటున్నారు. హీరోయిన్ గా అనుష్కను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే మరికొంత సమయం తీసుకోవాలనే నిర్ణయంతో మెగా మేకప్ చూసేందుకు మెగా ఫ్యాన్స్ మరింత ఓపిక పట్టాల్సిన అవసరం ఏర్పడింది. నరాలు తెగే ఉత్కంఠ అభిమానుల్లో రాజ్యమేలుతోంది.

ఇవి కూడా చదవండి:మళ్లీ అదే తప్పు చేస్తున్న

ఇవి కూడా చదవండి:పవన్కన్యాకుమారికి కొత్త పేరు

English summary

Mega Star Chiranjeevi's 150th film launch event was done in behalf of Chiranjeevi Family members and not yet the shooting of that movie was started . Due to this fans were in Huge disappointment and according to a latest news that Chiru's 150th film shooting was going to be start from June Last Week Or From July First Week.