కత్తిలాంటోడు 'నెపోలియన్' అయ్యాడా!

Chiru 150th Movie Title Changed

10:37 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Chiru 150th Movie Title Changed

హిస్టరీలో స్టాలిన్ , నెపోలియన్ , లెనిన్ ... ఇలా ఎందరో వామపక్ష భావ జాలం గానీ, మరోటి గానీ పుష్కలంగా ఉండి ప్రజలను చైతన్య పరిచే శక్తులుగా ఎదిగిన వారే. అందుకే వీళ్ళ పేర్లు చెప్పగానే అదోరకమైన ఉత్సాహం పెల్లుబిక్కుతుంది. వీళ్ళ చరిత్ర కాకపోయినా, వీరి పేర్లతో సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టాలిన్ వచ్చింది. ఇప్పుడు నెపోలియన్ రాబోతోందని టాక్. చిరు రీ ఎంట్రీతో ప్రతిష్టాత్మకంగా 150వ సినిమా కత్తిలాంటోడు జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఉన్నట్టుండి, ఆ సినిమా కత్తిలాంటోడు కాదంటూ స్వయంగా ఆ మూవీ నిర్మాత రామ్ చరణ్ కన్ఫామ్ చేసిన నేపథ్యంలో చిరు 150వ సినిమా టైటిల్ పైకి అందరి దృష్టి మళ్లింది.

సరిగ్గా ఇదే సమయంలో చిరు 150వ సినిమా పోస్టర్ అంటూ నెపోలియన్ పేరిట ఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. నెపోలియన్ టైటిల్ గా కల్గిన ఈ పోస్టర్ లో పోరాటం అతని నైజం అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో పొలం దున్నుతున్న రైతు ఫొటోను, చిరంజీవి ఫొటోను ఇచ్చి చిరంజీవి అంతర్లీనంగా భూభత్సం, రైతు ఆత్మహత్యలు, ల్యాండ్ మాఫియా వంటి అంశాలకు సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్ లను ఉంచారు. ఇదిలాఉంటే, టాలీవుడ్ కొత్త డైరెక్టర్ ఆనంద్ రవి 'నెపోలియన్' అనే టైటిల్ ని రిజిస్టర్ చేశాడో లేదో చిరుపేరిట కొత్త పోస్టర్ ప్రత్యక్షమైపోయింది. మొత్తానికి చిరు నెపోలియన్ సంచలనం అవుతోంది.

ఇవి కూడా చదవండి: కరెంటు బిల్ తగ్గించుకోవడానికి కొత్త టెక్నిక్!

ఇవి కూడా చదవండి:హల్ చల్ చేస్తున్న రష్మీ-సుధీర్ ల లిప్ లాక్!

English summary

Megastar Chiranjeevi's 150th Movie was titled as Kathilantodu Previously and now the name of this movie was changed to "Nepolian".