జూన్ 20న ఫస్ట్ షాట్ కి ముహూర్తం రెడీ...

Chiru 150th Movie To Start From June 20

11:47 AM ON 8th June, 2016 By Mirchi Vilas

Chiru 150th Movie To Start From June 20

తన 150వ చిత్రంగా తమిళ 'కత్తి'ని తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎంపిక చేసుకున్న మెగా స్టార్ చిరంజీవి ఇప్పటికే ముహూర్తం కూడా పూర్తిచేసుకుని, ఇప్పుడు షూటింగ్ ను మొదలెట్టబోతున్నాడట. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఫస్ట్ షాట్ కి రెడీ అయ్యాడు. ముహూర్తం కూడా ఖరారైంది. 'కత్తిలాంటోడు' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జూన్ 20 నుంచి సెట్స్ పైకి రాబోతోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారనే వార్త వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం మెగా ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ ఇప్పటి వరకూ హీరోయిన్ ని ఎంపిక చేయకుండానే యూనిట్ షూటింగ్ కి వెళుతోంది. చిరు సరసన నటించేందుకు ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ భామల పేర్లు వినిపించినా...అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరి ఆ అదృష్టం ఎవరిని వరించనుందో.

ఇవి కూడా చదవండి:సినీ నటుడ్ని బోల్తా కొట్టించారు ... లక్షలు దోచేశారు

ఇవి కూడా చదవండి:ప్రేమమ్ టీజర్ రిలీజ్ అప్పుడేనా ?

English summary

Mega Star Chiranjeevi's was get ready to start shooting of his 150th movie and this movie shooting was going to be start from june 20th and this movie was going to direct by V.V.Vinayak and this movie producing by Chiranjeevi's son Mega Power Star Ram Charan Tej on his own Banner 11"Anjana Productions".