వావ్, మెగా ఫాన్స్ లక్ష్యం ఇదా!

Chiru 150th Movie Trending in Social Networks

10:50 AM ON 19th August, 2016 By Mirchi Vilas

Chiru 150th Movie Trending in Social Networks

నిజంగా చెప్పాలంటే మిగిలిన అభిమాన సంఘాలకు మెగా ఫ్యాన్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. మెగా ఫాన్స్ రూటే వేరు. పైగా మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు పెరగడంతో, ప్రతీ మెగా హీరో మూవీ రిలీజ్ కి పండగ వాతావరణం కనిపిస్తోంది. అందుకే మెగా ఫాన్స్ కి ఈ మధ్య పండగలు ఎక్కువయిపోయాయి. నెలకు.. రెండు నెలలకు ఓ పండగ వచ్చేస్తోంది. అయితే, మెగాభిమానులకు అన్నిటి కంటే పెద్ద పండుగ 'మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే'. ఆ పండుగ ఎప్పుడంటే, ఆగస్ట్ 22నే... ఆరోజు చిరు 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో హోమాలు చేస్తున్న ఫాన్స్ బానే కానిస్తున్నారు. ఆఫ్ లైన్ లో పూజల హంగామా బాగానే నడుస్తోంది. వారం ముందు నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి పూజలు గట్రా మొదలెట్టేశారు. ఇక మెగాఫ్యాన్స్ చేసే ఆన్ లైన్ రచ్చ కూడా సరేసరి. ఈ రచ్చలో కూడా టార్గెట్స్ సెట్ చేసుకుని మరీ దూసుకుపోయేందుకు మెగా ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. 'ఈసారి మన టార్గెట్ లక్షకు పైగా ట్వీట్స్' అంటూ లక్ష్యాన్ని పంచుకుంటున్నారు. పైగా ఇప్పటికే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ కూడా మొదలైపోయింది. " #Chiru150.. #Chiru150FirstLook.." అనే హ్యాష్ ట్యాగులకు.. చిరు బర్త్ డే కౌంట్ డౌన్ సెట్ చేసి మరీ షేర్ చేసుకుంటున్నారు.

గతేడాది చిరు 60వ పుట్టిన రోజు సందర్భంగా మెగా వారోత్సవాలు జరిగాయి. ఇప్పుడు కూడా దానికి ఏ మాత్రం తగ్గకుండా మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేశారు. ఆన్ లైన్ లో మాత్రం తామెందుకు తక్కువగా ఉంండాలనే ఉద్దేశ్యంతో.. ఈ ట్రెండింగ్ స్టార్ట్ చేసేశారు. లక్ష ట్వీట్స్ టార్గెట్ ని అందుకోవడం మెగా బర్త్ డే ట్యాగ్ కు పెద్ద కష్టమేం కాదనే టాక్ వినిపిస్తోంది. అదండీ మెగా ఫాన్స్ సందడి.

ఇవి కూడా చదవండి:సాయి ధరమ్ ని పెళ్లి చేసుకుంటున్న 'కంచె' హీరోయిన్!

ఇవి కూడా చదవండి:కలలో మీ కుటుంబసభ్యులు వస్తే మంచి జరుగుతుందా లేక కీడు జరుగుతుందా?

English summary

Tollywood Mega Star Chiranjeevi was going to celebrate his 61st birthday on 22nd of this month and his fans were going to celebrate his birthday in a grand way and now "#Chiru150 and #Chiru150FirstLook" were trending over social media networks.