సచిన్ ఫుట్బాల్ జట్టులో మెగాస్టార్ - నాగ్

Chiru and Nagarjuna Deal with Sachin tendulkar

12:31 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Chiru and Nagarjuna Deal with Sachin tendulkar

క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ఫుట్ బాల్ ఆడడం ఏమిటి? అందులో మెగాస్టార్ చిరంజీవి , నాగార్జున ఉండడం ఏమిటి అనుకుంటున్నారా అవును మరి .. వివరాల్లోకి వెళ్తే , ఐఎ్సఎల్ ఫ్రాంచైజీ కేరళ బ్లాస్టర్స్లో టాలీవుడ్ హీరోలు చిరంజీవి, అక్కినేని నాగార్జున కూడా భాగస్వాములయ్యారు. పెట్టుబడిదారుల కన్సార్షియమ్లో వీరితోపాటు నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఉన్నారు. బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కొంత భాగాన్ని ఈ కన్సార్షియం సొంతం చేసుకుంది. మేజర్ షేర్ కలిగిన సచిన్ సహ యజమానిగా కొనసాగుతాడు. బోర్డులో సహ యజమానులుగా ప్రముఖ వ్యక్తులు చేరినట్టు విలేకరుల సమావేశంలో మాస్టర్ తెలిపాడు. ఈ సీజన్లో ట్రోఫీ నెగ్గడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్టు చెప్పాడు. ఇదో కొత్తరకం అనుభవమని మెగాస్టార్ చిరంజీవి అన్నా రు. రెండు సినిమాల్లో తాను గోల్ కీపర్, కోచ్ పాత్రలు పోషించినట్టు గుర్తు చేశారు. విద్యలో క్రీడల పాత్ర కూడా ఉండాలని నాగార్జున ఉద్ఘాటించారు. దురదృష్టవశాత్తూ క్రీడల్లో దేశం వెనుకబడిందన్నారు. కాగా.. కేరళలో మద్యపానం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్వహించే ప్రచారంలో తన పేరును ఉపయోగించుకునేందుకు సచిన్ టెండూల్కర్ అంగీకరించాడు. తనను కలిసిన సందర్భంగా సచిన్ సమ్మతిని తెలియజేసినట్టు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.

ఇది కూడా చూడండి:మహిళలే ఎక్కువగా బూతు పదాలు వాడతారా?

ఇది కూడా చూడండి:సమస్యల సుడిగుండంలో ఉన్నాం .. అయినా భయపడం

ఇది కూడా చూడండి:పనికి పంపాలనుకున్న నాన్న పై కేసు పెట్టి న చిన్నారులు

English summary

Chiru and Nagarjuna Deal with Sachin tendulkar.