ఐఫా వెనుక చిరు హస్తం!!

Chiru behind IIFA

04:03 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Chiru behind IIFA

ఇప్పటివరకూ బాలీవుడ్‌ కి మాత్రమే పరిమితమైన ఐఫా అవార్డులు ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో కూడా మొదలుపెట్టారు. ఈ ఐఫా ఉత్సవాలు జనవరి 24, 25 తేదీల్లో హైదరాబాద్‌ లోని గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన ప్రముఖులంతా ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. అయితే హఠాత్తుగా ఈ ఐఫా అవార్డులు సౌత్‌లో ఇచ్చారేంటని చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలకు మెగాస్టార్‌ చిరు క్లారిటీ ఇచ్చారు. ఐఫా అవార్డులు తన కారణంగానే హైదరాబాద్‌ లో ఇచ్చారని చిరు చెప్పాడు.

చిరు కేంద్రటూరిజం శాఖమంత్రి గా ఉన్నప్పుడు విదేశాలలో జరిగిన ఐఫా ఉత్సవాలకి హాజరయ్యాడట. అక్కడ ఐఫా యాజమాన్యాన్ని కలిసి మా సౌత్‌లో ఈ ఐఫా వేడుకలు ఎందుకు జరపకూడదు అని అడిగారట. అందుకు వాళ్ళు త్వరలోనే అక్కడికి కూడా వస్తామని చెప్పారట. వాళ్ళు చెప్పినట్టుగానే సౌత్‌కి వచ్చేశారు.

English summary

International Indian Film Academy 2016 awards was held at Hyderabad Gachibowli Stadium. In this award function Mega Star Chiranjeevi gave a speech in that speech he told that i am the reason for IIFA awards 2016.