పెళ్లి పనుల్లో మెగా బిజీ

Chiru Busy With His Daughter Marriage

01:24 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Chiru Busy With His Daughter Marriage

అడపాదడపా కనిపించినా, ఇంచుమించు రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టాడు. కొంచె కుర్ర హీరోగా కనిపించేందుకు అవసరమైన సర్జరీ కూడా చేయించుకున్న చిరు ఇప్పుడు, పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంటూ , కుటుంబ వాతావరణంలో సందడి చేస్తున్నాడు. చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ కు పెళ్లి చేయడానికి నిర్ణయించడం , నిశ్చితార్ధం జరిగి , ముహూర్తం కూడా ఖరారైందన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో పెళ్లి సందడి నెలకొంది. చిత్తూరుకి చెందిన ఓ బడా బిజినెస్ మ్యాన్ శ్రీజను వివాహం చేసుకోబోతున్నాడు. పెళ్లి పనుల్లో బిజీగా వున్న మెగా కుటుంబంలో కూతుళ్ళు ,కోడలితో కల్సి సేల్ఫీ దిగి సందడి చేస్తున్న చిరు, దగ్గరుండి పెళ్లి పందిరి రాట మొహూర్తం చేసాడు. పసుపు , కుంకుమ , మామిడి తోరణాలు అన్నీ సిద్ధం చేసి , పెళ్లి రాట పాతారట. ఇక ఈ పెళ్ళికి ఇటు సినీ ఇండస్ట్రీ , అటు రాజకీయ రంగం , అలాగే ఇతర రంగాల ప్రముఖుల్ని కూడా ఆహ్వానించే పనిలో కూడా ఇప్పుడు చిరు యమ బిజీ గా వున్నట్టు బోగట్టా.

English summary

Politician and Movie Hero Megas Star Chiranjeevi was going to do marriage to his second daughter Sreeja.She was going tio be married with the top business man son belongs to chitoor.At present he was busy with the workls of his daughter marriage.