25నే మెగా పెళ్లి సందడి

Chiru Daughter Srija Marriage On 25th Feb

10:22 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Chiru Daughter Srija Marriage On 25th Feb

అవునా , అవుననే సమాధానం వస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్న సంగతి తెలిసిందే. తన చిన్న కూతురు శ్రీజ పెళ్లి దగ్గరుండి చేయించ బోతున్నాడు. ఇప్పటికే పసుపు-కుంకుమ వేడుక చేసిన చిరు కుటుంబం. తాజాగా పెళ్లికి డేటు కూడా ఫిక్స్‌ చేసేసిందని అంటున్నారు. ఇంకో పది రోజుల్లో, అంటే ఫిబ్రవరి 25న శ్రీజ పెళ్లి జరగబోతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్‌ అనే కుర్రాడితో శ్రీజ పెళ్లి నిశ్చయించి, మార్చిలో పెళ్లి ముహూర్తం అనుకున్నప్పటకీ.. సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసేయాలని భావించి ఫిబ్రవరి 25కే ఫిక్స యినట్లు తాజా సమాచారం.

అయితే ఈ పెళ్లి పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా ముగించేయాలని చిరు కుటుంబం భావిస్తోంది. ఫలితంగా రిసెప్షన్‌ లాంటి కార్యక్రమాలు కూడా ఉండ వని అంటున్నారు. ఇక ఇండస్ట్రీ నుంచి ఎవరినీ పిలవ డం లేదట. చాలా సింపుల్‌గా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి తతంగం పూర్తి చేస్తారని తెలుస్తోంది. అందుకే పెళ్లి మొహూర్తం కూడా ముందుకు జరిపినట్లు తెలియవస్తోంది. శ్రీజ గతంలో శిరీష్‌ భరద్వాజ్‌ అనే కుర్రాడిని శ్రీజ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత తీవ్ర విభేదాలు వచ్చి తిరిగి పుట్టింటికి వచ్చేయడం తెలిసిందే. వీళ్లిద్దరికీ ఓ పాప కూడా ఉంది. ఐతే శిరీష్‌ నుంచి విడాకులు కూడా తీసుకున్న శ్రీజ, ఇప్పుడు చేసుకోబోయే పెళ్లి కొడుకు కళ్యాణ్‌ ఆమె చిన్నప్పటి క్లాస్‌ మేటేనట.

English summary

Mega Star Chiranjeevi's Second daughter Srija marriage was on February 25th.Srija to be married to Kalyan who belongs to Chitoor.Kalyan was the classmate of srija.In past she married Sirish Bharadwaj and later they took divorce.