చిరు ఇంట పెళ్లి సందడి!!

Chiru daughter Srija second marriage

02:28 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Chiru daughter Srija second marriage

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజ్ అనే యువకుడు ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న శ్రీజ ఆ వివాహ బంధాన్ని త్వరగానే వదులుకుంది. శిరీష్ నన్ను హింసిస్తున్నాడని, కలిసి జీవించలేనని విడాకుల కోసం కోర్టుకెళ్లింది. విచారణ మొదలు పెట్టిన న్యాయస్ధానం శ్రీజ-శిరీష్ లకు వెంటనే విడాకులు మంజూరు చేసింది. ఈ ఇద్దరికీ ఒక పాప కూడా ఉంది. శ్రీజ ప్రస్తుతం వేరే దేశంలో ఉంటోంది. తాజా సమాచారం ప్రకారం శ్రీజకు రెండో పెళ్లి చెయ్యాలని చిరంజీవి నిర్ణయించుకున్నారట. శ్రీజను పెళ్లి చేసుకోవాల్సిందిగా మెగా ఫ్యామిలీ శ్రీజ కు నచ్చజెప్పారాట. ఇందుకు శ్రీజ కూడా ఒప్పుకుందని సమాచారం.

ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు శ్రీజ కోసం వరుడిని వెతకడం మొదలుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకున్న శ్రీజ రెండో పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులు వేసి, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నారట. అందుకే పెళ్లి కొడుకు విషయంలో తనే చివరి నిర్ణయం తీసుకోవాలని చిరు అభిప్రాయం. అన్నీ కుదిరితే ఈ సంవత్సరమే శ్రీజ పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కాబట్టి త్వరలోనే చిరు ఇంట్లో పెళ్లి సందడి మొదలవనుందని సమాచారం.

English summary

Chiranjeevi family decided to do his second daughter Srija's second marriage soon. Already they are searching good life partner for Srija.