చిరు 150 మూవీ విజయం సాధించాలని సుష్మిత పూజలు(వీడియో)

Chiru daughter Sushmitha worshipped God for 150th movie

11:42 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Chiru daughter Sushmitha worshipped God for 150th movie

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం పురష్కరించుకొని రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు, కేరళలోని ప్రధాన ఆలయాల్లో తొమ్మిది రోజుల పాటు ఆల్ ఇండియా చిరంజీవి అభిమాన సంఘం పూజలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. వినాయకుని దర్శనార్ధం కాణిపాకం విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత, తన తండ్రి 150వ చిత్రం ఘనవిజయం సాధించాలని, సినీ చరిత్రలో చిరంజీవి చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరుతూ వినాయకుడు, మణికంఠేశ్వరుడికి పూజలు చేయించారు.

అధ్యక్షుడు స్వామి నాయుడు మాట్లాడుతూ, ఆదిదేవుడైన వినాయకస్వామి ఆలయం నుంచే ఈ పూజలను ప్రారంభించినట్లు తెలిపారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటి, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. చివరిరోజైన 22వతేదీ హైదరాబాద్ ఫిలింనగర్ లోని సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వివరించారు.

English summary

Chiru daughter Sushmitha worshipped God for 150th movie