పవన్‌ సినిమాలో ‘ చిరు ’

Chiru guest role in sardhar gabbar singh

06:08 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Chiru guest role in sardhar gabbar singh

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించిన గబ్బర్‌సింగ్‌ సినిమా సూపర్‌హిట్‌ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా గబ్బర్‌సింగ్‌కి సీక్వెల్‌గా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ తీస్తున్నారు. ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి చెందిన ఓ నటుడు కనిపించబోతున్నాడని మొన్నటి వరకు వార్తలు వినిపించాయి. అయితే ఇందులో యువనటుడికి అవకాశం ఉందని అనుకున్నారు. కాని యువనటుడు కాదని ఏకంగా మెగాస్టార్‌ సర్దార్‌ లో దర్శనమివ్వనున్నారని వార్తలు వినపడుతున్నాయి. మెగాస్టార్‌, వపర్‌స్టార్‌ కలిసి చివరిగా శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ లో నటించారు. తరువాత ఈ సినిమాలో కనిపించనున్నారని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary

Chiru guest role in sardhar gabbarsingh