చిరు మదర్ అండ్ ఫాదర్ ఎవరో తేల్చేశారు!

Chiru mother and father was finalized for 150th movie

10:35 AM ON 6th August, 2016 By Mirchi Vilas

Chiru mother and father was finalized for 150th movie

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న కత్తిలాంటోడు మూవీకి సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. సెలైంట్ గా షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాలో హీరోయిన్, విలన్ ఈ మధ్యే ఖరారు చెయ్యగా, ఇప్పుడు చిరు ఫాదర్ గా సీనియర్ నటుడు చలపతిరావు, మదర్ గా అన్నపూర్ణ నటించనున్నట్లు తేల్చారు. ఇక వీళ్లపై కీలక సన్నివేశాలను డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కించనున్నాడు. ఇక ఈ ఫిల్మ్ రీషూట్ జరుగుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా చిరు- అలీలపై తెరకెక్కించిన రషెష్ చూసిన మెగాస్టార్, ఆయా సన్నివేశాలపై అసంతృప్తి వ్యక్తంచేసినట్టు టాక్ కూడా వచ్చింది.

కామెడీ అనుకున్న స్థాయిలో రాలేదని దీంతో మళ్ళీ షూట్ చేయాలని భావించినట్లు కూడా వార్తలు వచ్చాయి. నిజానికి అలీ చేసిన క్యారెక్టర్ సునీల్ చేయాల్సివుండగా, ఇతనికి కాల్షీట్స్ లేవని తప్పుకొన్నాడని అంటున్నారు. అయితే తాను నటించేందుకు రెడీ అంటూ సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిరు ఆ వైపు ఫోకస్ పెట్టినట్టు ఇన్ సైడ్ టాక్. ఫలితంగా అలీతో తీసిన ఆయా సన్నివేశాల్ని సునీల్ తో రీషూట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రతి చిన్న విషయంలోనూ మెగాస్టార్ కేర్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ మూవీ పై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

English summary

Chiru mother and father was finalized for 150th movie