చిరు 150 వ సినిమా ఫిక్స్ 

Chiru To Act In Katti Remake

03:23 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Chiru To Act In Katti Remake

మెగా అభిమానులందరూ చిరంజీవి 150 వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. చిరు 150 వ సినిమా అప్పుడు ఇప్పుడు అని ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వని చిరు ఫ్యామిలి ఆఖరికి చిరు నటించబోయే 150 వ సినిమా ఖరారు చేసింది.

రిట్జ్‌ ఐకాన్‌ అవార్డుల కార్యక్రమానికి హాజరైన రామ్‌చరణ్‌ మాట్లాడుతూ చిరంజీవి 150 వ సినిమాగా తమిళంలో మురుగదాస్ దర్శకత్వం లో విజయ్ నటించిన చిత్రం కత్తి రీమేక్‌ లో చిరు నటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా బాద్యతలు టాలీవుడ్‌లో రీమేక్‌ సినిమాలు చెయ్యడంలో దిట్ట అయిన వి.వి.వినాయక్‌ కు అప్పగించారు. గతంలో వి.వి.వినాయక్ చిరుతో ఠాగూర్‌ వంటి సినిమాను తీసి సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి 150 వ సినిమాకు కూడా వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించనుండడంతో అంతదరిలోను ఈ సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది.

మెగాస్టార్‌ ఫ్యాన్స్‌ అందరూ చిరు 150 వ సినిమా కోసం గత రెండేళ్ళగా ఎదురు చూస్తున్నారు. చిరు హీరోగా చివరిసారిగా 2007 లో శంకర్‌దాదా జిందాబాద్‌ చిత్రంలో నటించారు. ఆ తరువాత 2009 లో మగధీర చిత్రంలో గెస్ట్‌ పాత్రలో నటించాడు. తాజాగా రామ్‌చరణ్‌ బ్రూస్లీ సినిమా చివర్లో వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు.

అయితే చిరు 150 వ సినిమా కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు చిరు కత్తి రీమేక్‌ తో వస్తుండడంతో చిరు అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.

English summary

Ram charan tej confirmed the 150th film of chiranjeevi. Ram charan said that chiranjeevi is going to remake Tamil Kathi Film under the direction of V.V.Vinayak