మిస్ ఇండియా కాంపిటేషన్ లో చిత్తూరు నెరజాణ ...

Chittoor Girl Sanjana In Miss India Race

10:12 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Chittoor Girl Sanjana In Miss India Race

తెలుగుదనం ఉట్టిపడుతూ , తెలుగు అందాన్ని మెరిపిస్తూ , మిస్ ఇండియా కాంపిటేషన్ లో తెలుగు అమ్మాయి .... అదీ చిత్తూరు పిల్ల సంజన అందం చూడవయా, ఆనందించవయా అంటూ చక చకా దూసుకుపోతోంది. ఇప్పటికే దక్షిణాది మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిల్చి, కొంచెం లో కిరీటం పోగొట్టుకున్న ఈ ఆంద్ర అమ్మాయి సంజన ఓ పక్క ర్యాంప్ మీద జిగేల్ మనిపిస్తూ , మరోపక్క తెలివి తేటల్లో సైతం ఆదరగోట్టేస్తోంది. ప్రస్తుతం టాప్ కంటెంటర్ గా ఉన్న ఈ అమ్మాయి అందరినీ ఆకట్టుకుంటోంది.

చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం ప్రాంతానికి చెందిన సంజన, ప్రస్తుతం బెంగుళూరులో ఉంటోంది. పరంధామ నాయుడు , ఇంద్రావతి ల పుత్రిక అయిన సంజన బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సంజన మిస్ ఇండియా కోసం తహ తహ లాడుతోంది . ఇప్పడు పోటీలో భాగంగా ఫెమినా ప్రాసెస్ అవుతోంది. ఇప్పటికే జరిగిన పోటీల్లో తన సత్తా చాటింది. 'ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే, 'ప్రేమలో పెరగండి - ప్రేమలో మాత్రం పడకండి' అంటూ డ్రమటి క్ గా సమాధానాలిస్తూ చలాకీగా కనిపిస్తోంది. అన్నట్టు ఈ పోటీల్లో 15వేల మందితో ఫిల్టరేషన్ మొదలు పెట్టి, వరుస పరీక్షలు నిర్వహిస్తుంటే, ఇండియా లెవెల్లో 22వ స్థానానికి సంజన వచ్చేసింది. మరి కష్ట పడుతున్న సంజన కు మిస్ ఇండియా అవ్వాలనే కోరిక నెరవేరుతుందా లేదా చూద్దాం ...

ఇవి కూడా చదవండి

'సర్దార్ ' లో దాగున్న రహస్యాలు

పాపం.. 19 నెలల కూతురినే పెళ్ళాడిన తండ్రి ...

మోడలింగ్ ఫొటోలతో 'వ్యభిచారి' గా బుక్కయిన టీచర్

మ్యాచ్ జరుగుతుండగానే బిడ్డను కన్న ప్లేయర్

English summary

A Model Named Sanjana From Chittoor District was in the race of Femina Miss India Contests.Presently She was working as a Software engineer in Banglore.