చిత్తూరు మేయర్‌ దారుణ హత్య

Chittoor Mayor Katari Anuradha was brutally murdered and her husband Katari Mohan, was in Critical Condition

03:43 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Chittoor Mayor Katari Anuradha was brutally murdered and her husband Katari Mohan, was in Critical Condition

చిత్తూరు మేయర్‌ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌లపై కొద్దిసేపటి క్రితం గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. కత్తితో దాడి చేశారు. మేయర్‌ ఛాంబర్‌లోనే దుండగులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. మేయర్‌ అనురాధ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. మేయర్‌ భర్త మోహన్‌ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు దుండగులు కారులో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతి సమీపం నుంచే కాల్పులకు దిగి పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చినట్లు తెలుస్తోంది. కర్నాటక గ్యాంగ్‌ పనేనని అనుమానిస్తున్నారు. మేయర్‌ అనురాధ మరణంతో తెలుగుదేశం శ్రేణులు దిగ్భ్రాంతి చెందారు.

English summary

Chittoor Mayor Katari Anuradha was brutally murdered and her husband Katari Mohan, was in Critical Condition.