కుచేలుడి అవతారం దాల్చిన టిడిపి ఎంపి

Chittoor MP Siva Prasad Protest In Delhi

10:49 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Chittoor MP Siva Prasad Protest In Delhi

విచిత్ర వేషధారణ సాయంతో రాష్ట్ర సమస్యలను కేంద్రం ముందు కు తెచ్చే అలవాటు గల తెలుగుదేశం పార్టి చిత్తూరు ఎంపి శివ ప్రసాద్ తాజాగా కుచేలుని అవతారం ఎత్తారు. రాష్ట్ర విభజన సమయంలో పలు రకాల వేషాలు వేసి..హంటర్ తో కొట్టుకొని అప్పటి యూపీఎ సర్కారుకు విన్నపాలు చేసిన డాక్టర్ శివప్రసాద్ సినిమాల్లో కూడా వేషాలు వేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం ఎపి ఎదుర్కొంటున్న సమస్యలను మోడీ నేతృత్వంలోని ఎన్డిఎ సర్కారు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శిశుపాలుడి వేషం కట్టి ఎపి కి ప్రత్యేక హోదా, కొత్త రాష్ట్రానికి కేంద్ర సాయం తదితర అంశాలపై ప్రధాని మోడీకి తనదైన స్టైల్లో గోడు వినిపించారు.రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటుతో సతమతమవుతున్న నవ్యాంధ్రకు కొద్దికొద్దిగా విదిలించడం కాకుండా భారీగా ఆర్థిక సాయం చేయాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎపి సిఎం చంద్రబాబు కేంద్రం తీరుతో సతమతమవుతున్నారని చెప్పుకొచ్చారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన, విజయ్ చౌక్ వద్ద కుచేలుడి వేషధారణలో ప్రత్యక్షమై వినూత్న నిరసన చేపట్టి హస్తినవాసుల్ని ఆశ్చర్య పరిచారు. అంటే టిడిపి - బిజెపి నడుమ ప్రచ్చన్న యుద్ధం కాస్తా , బహిరంగ యుద్ధానికి తెరలేస్తుందా ?

ఇవి కూడా చదవండి: జగన్ ప్రాణాలు కాపాడిన హీరో శ్రీకాంత్

ఇవి కూడా చదవండి: చిరు పిక్చర్ కి ముహూర్తం ఫిక్స్

English summary

Chittoor MP Siva Prasad Agitation in Delhi by demanding Prime Minister Of India Narendra Modi to give special status and asking central government for Special packageS to Andhra Pradesh.