'నిత్య'తో రొమాన్స్‌ చేస్తున్న విక్రమ్‌!

Chiyaan Vikram romancing with Nithya Menon

10:49 AM ON 15th December, 2015 By Mirchi Vilas

Chiyaan Vikram romancing with Nithya Menon

ప్రయోగాల నటుడు చియాన్‌ విక్రమ్‌ నటించబోయే కొత్త చిత్రానికి మంచి నటుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఆనంద్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే విక్రమ్‌ సరసన నయనతారని ఎంపిక చేసుకున్నారు. అయితే రెండో హీరోయిన్‌ కోసం కాజల్‌ అగర్వాల్‌, బిందుమాధవిని సంప్రదించినా ఇప్పడు ఫైనల్‌గా నిత్యమీనన్‌ను ఎంపిక చేసుకున్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి చిత్రాలలో రెండో కథానాయిక పాత్రలో నటించి అలరించిన నిత్యమీనన్‌ ఈ చిత్రంలో కూడా రెండో హీరోయిన్‌గా నటించబోతుంది. విక్రమ్‌ సరసన నిత్యమీనన్‌ నటించడానికి ఇంకో కారణం కూడా ఉంది.

మొదటి నుంచి నిత్య విక్రమ్‌కి పెద్ద అభిమాని. అంతే కాకుండా చాలా సినీ కార్యక్రమాలలో నేను విక్రమ్‌ నటన చూసే స్ఫూర్తిని పొందాను అని చెప్పింది. ఈ రెండు కారణాలు వల్లే నిత్యమీనన్‌ విక్రమ్ సరసన రెండో కధానాయికగా నటించడానికి వెంటనే అంగీకారం తెలిపిందని తెలుస్తుంది.

English summary

Chiyaan Vikram romancing with Nithya Menon in his upcoming movie.