డాన్స్ మాస్టర్ ని డాన్స్ ఆడిస్తున్న కోడలు

Choreographer Shiv Shankar Made request to Jayalalitha

10:52 AM ON 2nd June, 2016 By Mirchi Vilas

Choreographer Shiv Shankar  Made request to Jayalalitha

అతనో పెద్ద డాన్సర్ .. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్... ఎన్నో లైవ్ షోలకు జడ్జి ... అయితేనేం అతన్నే డాన్స్ ఆడిస్తోంది అతని కోడలు.. ఈ మేరకు స్వయంగా అతడే తమిళనాడు సిఎమ్ జయలలితకు మొరపెట్టుకున్నాడు. ఇంతకీ అతనేవారంటే నాలుగు దశాబ్దాలకు పైగా సినీ నృత్య దర్శకుడిగా పనిచేస్తున్న శివశంకర్.... తన కుమారుడితో తెగదెంపులు చేసుకున్న కోడలు తమను వేధింపులకు గురిచేస్తోందని, ఆమె నుంచి తమను కాపాడాలని ముఖ్యమంత్రి జయలలితకు కొరియోగ్రాఫర్ శివశంకర్ విజ్ఞప్తి చేసాడు. కట్నం కోసం వేధిస్తున్నామంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని.. జయ జోక్యం చేసుకోనిపక్షంలో తమ కుటుంబానికి ఆత్మహత్య చేసుకోవటం మినహా మరో మార్గం లేదని వాపోయారు. శివశంకర్ కుమారుడు విజయకృష్ణ, బెంగుళూరుకు చెందిన జ్యోతిని 2013లో వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులకే ఆ దంపతుల మధ్య మనస్పర్థలొచ్చాయి. ఆ తర్వాత విజయకృష్ణ.. జ్యోతి నుంచి విడాకులు తీసుకున్నారు. జ్యోతి ఇటీవల శివశంకర్ ఇంటి వద్ద ధర్నా చేసి..కట్నం కోసం శివశంకర్ కుటుంబికులు తనను వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శివశంకర్ మీడియా ముందుకు వచ్చాడు . తప్పుడు ఆరోపణలతో తమపై కేసు నమోదు చేయడంతో కొద్ది రోజులపాటు అజ్ఞాతంలో గడిపామని శివశంకర్ వివరించాడు. తమకు రూ.10 కోట్లు చెల్లించాలని జ్యోతి కుటుంబికులు పట్టుబడుతున్నారని, తాను సంపాదించి కట్టుకున్న ఇంటిని అపహరించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. తన కుమారుడు విజయకృష్ణ ఇప్పటికీ జ్యోతితో కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా శివసంకర్ చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చూడండి :వీళ్ళందరూ కలిసి వ్యాపారం మొదలు పెట్టారు!

ఇది కూడా చూడండి :తెలివిగా చనిపోయినట్లు నటించింది.. తరువాత రేపిస్ట్ నుండి తప్పించుకుంది

ఇది కూడా చూడండి :అంతటా సందడే సందడి...డోలు బాజే....

English summary

Choreographer Shiv Shankar Made request to Jayalalitha.