మరో బాల భీముడు

Chota bheem

12:17 PM ON 7th July, 2016 By Mirchi Vilas

Chota bheem

భారతంలో భీముడు గురించి అందరికీ తెల్సిందే. అతి బలవంతుడు.. కానీ ఈ బాల భీముడు బరువే తప్ప బలవంతుడు కాదు.. మరి ఏమిటి వివరాల్లోకి వెళదాం. ఈ పిల్లాడి పేరు శ్రీజిత్. వయసు 18 నెలలు. కానీ బరువు మాత్రం 22 కిలోలు. లెప్టిన్ అనే హార్మోన్ లోపం అతడికీ సమస్యను తెచ్చిపెట్టింది. మనదేశంలో ఇలాంటి కేసు నమోదు కావటం ఇది రెండోసారి మాత్రమే. మనం భోజనం చేస్తున్నప్పుడు కడుపు నిండగానే లెప్టిన్.. ఆ విషయాన్ని మెదడుకు చేరవేస్తుంది. దీంతో ఆకలి తీరిన బావన కలిగి, తినటం ఆపేస్తాం. అయితే శ్రీజిత్ లో లెప్టిన్ హార్మోన్ జన్యులోపం అతడి బరువు పెరగటానికి దారితీస్తోందని ముంబయిలోని జస్ లోక్ ఆసుపత్రి వైద్యులు విల్సేషిస్తున్నారు.

పుట్టినపుడు 2.5 కిలోల బరువున్న అతడు 6 నెలల్లోనే 4 కిలోల బరువు పెరిగాడు. 10 నెలల్లో 17 కిలోలకు, ఇప్పుడు 22 కిలోలకు చేరుకున్నాడు. శ్రీజిత్ తరచుగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుంటాడని, సొంతంగా కూచోవటం నిలబడటం చేతకాదని అతడి తల్లి తెలిపారు. తినటానికి ఏదైనా ఇవ్వకపోతే ఏడ్చి గోల చేస్తాడని వివరించారు. లెప్టిన్ జన్యువు మార్పు - దీని లోపానికి భారత్ లో చికిత్స లేదు. హార్మోన్ నియంత్రణలో ఉండటానికి పిల్లాడికి రోజుకు రెండు సార్లు లెప్టిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది ఇంగ్లాండులో మాత్రమే అందుబాటులో ఉంది అని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

దీనికి చికిత్స చేయకపోతే ఇతరత్రా సమస్యలకూ దారితీస్తుందట. ఎందుకంటే, శ్రీజిత్ ఇప్పటికే అధిక రక్తపోటు మందులు వాడుతున్నాడట.

English summary

Chota bheem