కూతురుకి పాలు పట్టిస్తున్న క్రిస్ గేల్!

Chris Gayle feeding milk to his baby

03:34 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Chris Gayle feeding milk to his baby

అతను మైదానంలో అడుగు పెట్టాడంటే చాలు పరుగుల వరద పారడం ఖాయం. అతను స్టేడియం దాటించి బంతిని బయటికి కొడుతుంటే ప్రత్యర్ధులు అతనికి బాల్ ఎక్కడ వెయ్యాలో తెలియని పరిస్థితి. ఇంతకీ అతనెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. అతనే విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్. ఎప్పుడూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే క్రిస్ గేల్ కుదురుగా కూర్చుని కూతురుకు పాలు పట్టాడు. సోషల్ మీడియా వెబ్ సైట్ ఇంస్టాగ్రామ్ లో క్రిస్ గేల్ పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ లా మారింది. ఇటీవలే కొన్ని నెలల కిందట క్రిస్ గేల్ భార్య బెరిడ్జ్ ఓ పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఆ పాపకు 'బ్లష్' అని పేరు పెట్టుకున్న గేల్, బోసి నవ్వుల పాపను చూసి సంబరపడిపోతున్నాడు. తండ్రిగా మారిన తర్వాత గేల్ లో పెద్ద మార్పే వచ్చినట్లే కనిపిస్తోంది. కుమార్తెతో కాలక్షేపం చేసేందుకు గేల్ ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ కు కూడా దూరమయ్యాడనే వార్తలు వచ్చాయి. కాగా, ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో సేదతీరుతున్న క్రిస్ గేల్ తన చిన్నారి కూతురుకి పాలు పడుతున్నాడు. చిన్నారి బ్లష్ కు పాలు పడతూ తీయించుకున్న ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 21 వేల లైక్స్ వచ్చి హాట్ టాపిక్ అయింది.

I got u #Krissi #UniversalPrincess ????

A photo posted by KingGayle ???? (@chrisgayle333) on

English summary

Chris Gayle feeding milk to his baby