కోహ్లీ కి గేల్‌ వార్నింగ్‌

Chris Gayle gave warning to Virat Kohli

02:54 PM ON 31st March, 2016 By Mirchi Vilas

Chris Gayle gave warning to Virat Kohli

20 రోజుల నుండి జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌ రెండో సెమీ ఫైనల్‌ ఈ రోజు(మార్చి 31న) ఇండియా-వెస్టిండీస్‌ మధ్య జరగనుంది. భారత క్రికెట్‌ అభిమానులంతా నాలుగు రోజులు నుంచి ఎదురు చూస్తున్న ఈ రోజు వచ్చేసింది. తమ అభిమాన టీమ్‌ ఇండియా సెమీ ఫైనల్‌ లో గెలిచి ఫైనల్‌ కి దూసుకుపోతారని అందరూ భావిస్తున్నారు. అయితే మ్యాచ్‌ మాట ఎలా ఉన్నా విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్‌ గేల్‌ మాత్రం తన సంచలన వ్యాఖ్యలతో మ్యాచ్‌ పై ఆసక్తి కలిగేలా చేశాడు. అదేంటంటే భారత బౌలర్లు అనుకున్నంతగా ఏమీ ఆకట్టుకోలేక పోతున్నారు, కాబట్టి బౌలర్లు ఎవరైనా సరే నేను మాత్రం బంతిని బౌండరీ దాటించడానికి రెడీగా ఉన్నాను. అంటూ బౌలర్లకు వార్నింగ్‌ ఇచ్చాడు.

ఇంక విరాట్‌ కోహ్లీ కి కూడా వార్నింగ్‌ ఇచ్చాడు. అదేంటంటే కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్న మాట నిజమే. కానీ, మాతో జరిగే మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ 'ఆటలు మా దగ్గర సాగనివ్వం' అంటూ కోహ్లీకి వార్నింగ్‌ ఇచ్చాడు. అంతేకాదు భారత అభిమానులంతా తమ జట్టు పై ఎంతో నమ్మకంతో ఉన్నారు కానీ ఇండియాని మా పై గెలవనివ్వం అని క్రిస్‌ గేల్‌ అన్నాడు. అయితే భారత అభిమానులు మాత్రం గేల్ కు మరీ ఇంత అతి విశ్వాసం పనికి రాదు అంటున్నారు. అయితే ఈ రోజు ఎవరు గెలుస్తారో చూడాల్సిందే.

English summary

Chris Gayle gave warning to Virat Kohli. West Indies destructive batsman Chris Gayle gave serious warning to Virat Kohli.