బ్యాట్ తో బిగ్ బి మనస్సు దోచిన వైనం 

Chris Gayle Gifted Bat To Amitabh Bachchan

12:06 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Chris Gayle Gifted Bat To Amitabh Bachchan

మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటారు కదా ... కానీ ఆ మనసే దోచేస్తే పోలే, అనుకున్నాడో  ఏమో అతడు అదే చేసాడు. బాలీవుడ్ హీరో, బిగ్ బీ అమితాబచ్చన్ కి వెస్టిండిస్ బ్యాటింగ్ వీరుడు క్రిస్‌గేల్ ఓ చిన్న బహుమతి ఇచ్చి , ఏకంగా మనసే దోచేశాడు. తాను సంతకం చేసిన ఓ బ్యాట్‌ను అమితాబ్‌కు కానుకగా ఇచ్చాడు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో ప్రస్తావించాడు. గేల్ సంతకం చేసిన బ్యాట్‌ను తనకు పంపించాడని, తనకు చాలా ఆనందంగా ఉందని బిగ్ బి తెలిపారు. ‘‘గేల్.. మీరు నన్ను గుర్తుపట్టగలరని నేనెప్పుడూ అనుకోలేదు. మీరు నాపై చూపించిన గౌరవం ఎనలేనిది. మీరు సంతకం చేసి ఇచ్చిన ఈ కానుక అమూల్యమైనది’’ అని బ్యాట్‌తో తాను దిగిన ఫొటోతో ట్వీట్ చేసాడు బిగ్ బి. ‘‘నా స్పార్టన్ బ్యాట్‌ను లెజెండ్‌కు గిఫ్ట్‌గా ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన సినిమాలను, ఆయన శైలిని నేను ఎంతగానో అభిమానిస్తా’’ అని గేల్ ట్వీట్ చేశాడు. ఎదురుగా తారస పడడమే కాక, ట్వీట్, రీ ట్వీట్ లతో సైతం పరస్పర ప్రేమ ను కురిపించుకున్నారు. 

మరిన్ని వివరాలు స్లైడ్ షో లో చుడండి... 

1/4 Pages

స్పెషల్ గిఫ్ట్ 


గేల్ సంతకం చేసిన స్పార్టన్ బ్యాట్‌ను అమితాబ్ కు అందచేస్తున్న స్పార్టన్ ప్రతినిధి.

English summary

Chris Gayle plays for Royal Challenger Bangalore in the Indian Premier League. He gifted Spartan Bat To Amitabh Bachchan.