క్రిస్ గేల్ కు సెక్స్ తప్ప మరో ఆలోచన ఉండదట!

Chris Gayle likes romance very much

10:53 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Chris Gayle likes romance very much

వెస్టిండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్.. గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్రౌండ్ లోకి వచ్చాడంటే ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్ధులను ఊచకోత కోస్తాడు. ఎన్నో సార్లు ఓడిపోయే మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించిన ఘనత క్రిస్ గేల్ సొంతం. అయితే ప్రతి మనిషిలోనూ రెండు వ్యక్తులు ఉంటారు.. ఒకటి బయటికి కనిపించేవాడు.. రెండు లోపల ఉండే వాడు.. అలాగే క్రిస్ గేల్ లోనూ ఇద్దరు ఉన్నారు. మైదానంలో బ్యాట్ తో మెరిసే ఈ జమైకా ఆటగాడు.. మైదానం వెలుపల నోటిదూలతో ఇరకాటంలో పడుతున్నాడు. సెక్స్ గురించి తనకి నచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు.

ఈ క్రికెటర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో ‘నీ కళ్లు చాలా బాగున్నాయి.. నాతో డేటింగ్‌ కు వస్తావా.. కలిసి తాగుదాం’ అంటూ మహిళా స్పోర్ట్స్ యాంకర్‌ తో అసభ్యంగా మాట్లాడిన ఘటన మరచిపోకముందే.. తాజాగా శృంగారపరమైన వ్యాఖ్యలతో మళ్లీ వివాదానికి తెర లేపాడు. బ్రిటిష్ దినపత్రిక ‘ద టైమ్స్‌’ మహిళా జర్నలిస్టు చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళా జర్నలిస్టును అభ్యంతరకర ప్రశ్నలు అడిగి గేల్ తీవ్ర విమర్శలపాలయ్యాడు. నువ్వు ముగ్గురితో శృంగారానికి పాల్పడ్డవా? అని ఆ జర్నలిస్టును గేల్ వెకిలిగా అడిగాడట. అంతటితో ఆగకుండా ‘నువ్వు చేసి ఉంటావు’ అన్నాడట.

అంతేనా… మహిళలు సమానత్వం కన్నా ఎక్కువగానే ఎంజాయ్‌ చేస్తున్నారని, తమ దేశంలో సెక్స్‌ అనేది రిలాక్స్‌ కోసమేనన్న భావముందని వివరించాడట. ఇంకా ‘మహిళలు తానంటే పడిచస్తారని, తాను చాలా అందంగా కనిపిస్తానని గేల్‌ చెప్పుకొచ్చాడట. ‘మహిళలకు ఎక్కువ సమానత్వం ఉంది. వారు ఏం కావాలనుకుంటే అది చేయగలరు. జమైకా మహిళలు చాలా దృఢంగా ఉంటారు. తమకు ఎప్పుడు సెక్స్ కావాలో వాళ్లే మీకు చెప్తారు’ అని అన్నాడట. ఇంకా 'నా బ్యాటు చాలా చాలా పెద్దది. ప్రపంచంలోనే పెద్దది. నువ్వు ఎత్తగలవు. అందుకోసం రెండు చేతులూ ఉపయోగించాలి' అని ద్వంద్వార్ధాలు వచ్చేలా క్రిస్ గేల్ మాట్లాడడట.

ఇంకా ఎన్నో చెప్పుకోలేని ప్రశ్నలు తనను వేశాడని జర్నలిస్ట్ ఎడ్వర్డ్స్ వాపోయింది. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద, అసభ్య వ్యాఖ్యలు చేసిన గేల్ వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. క్రిస్ గేల్ కి బుద్ధి చెప్పాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. విచ్చలవిడిగా ఉండే గేల్ వ్యాఖ్యలు కొత్త కానప్పటికీ, గేల్ ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అతని సహచరులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలానే వ్యవహరిస్తే మాత్రం గేల్ భవిష్యత్తు నాశనమవ్వడం ఖాయమంటున్నారు.

English summary

Chris Gayle likes romance very much