ఉద్యోగం ఇప్పిస్తానని 30 మందిని రేప్ చేసిన పాస్టర్.. ఆపై..

Church pastor raped 30 girls

11:44 AM ON 6th October, 2016 By Mirchi Vilas

Church pastor raped 30 girls

లోకం తీరు ఎటు పోతుందో అంతుబట్టడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో తెలీని విచిత్ర దుస్థితి రాజ్యమేలుతోంది. మత గురువులు సైతం దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా బోధనలు చెప్పాల్సిన ఓ పాస్టర్ ఏకంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి 30 మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అందులో ఓ యువతి ప్రెగ్నెంట్ అయ్యింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుబట్టడంతో హత్య చేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరునల్వేలి జిల్లాకు చెందిన 46 ఏళ్ల మిలన్ సింగ్, రామనాధపురంలోని చర్చి ఫాదర్ గా పనిచేస్తున్నాడు.

ఆరు నెలల కిందట పాళయంకోటకు చెందిన కాంతిమతి అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె నుండి ఐదు లక్షల రూపాయలు, బంగారు నగలు తీసుకున్నాడు. పది రోజుల కిందట ఉద్యోగం వచ్చిందని చెప్పి కాంతిమతిని ఓ చోటకు తీసుకెళ్లాడు. వెళ్తున్న కారులోనుండి రోడ్డుపైకి తోసి పారిపోయాడు పాస్టర్. మిలన్ సింగ్ యవ్వారంపై బాధితురాలు ఫిర్యాదుతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక విచారణలో క్రైస్తవ ఫాదర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మొత్తం 30 మంది యువతులను అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. ఈ పాస్టర్ వల్ల 24 ఏళ్ల అన్బుసెల్వం అనే యువతి గర్భం దాల్చిందని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చంపి, సజీవ దహనం చేశాడని తేలింది. చివరకు పాపాలు పండడంతో మత బోధకుడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది.

ఇది కూడా చదవండి: ఆర్మీ అధికారి భార్యకు పోర్న్ వీడియో పంపాడు.. ఆపై ఏమైందంటే..

ఇది కూడా చదవండి: వధూవరులు పెళ్ళిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు?

ఇది కూడా చదవండి: 'జాగ్వార్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

Church pastor raped 30 girls. A church pastor raped 30 girls and in that one girl got preganancy. For that he killed that pregnant woman.