సిగరెట్ పీకలే కదా అని పారేస్తే,... వాళ్ళు ఏం చేసారో తెలుసా?

cigarette filters wastage brings environmental damage

11:39 AM ON 1st February, 2017 By Mirchi Vilas

cigarette filters wastage brings environmental damage

పర్యావరణం దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నా, చేసేవి చేసేస్తున్నారు. జరిగేవి జరిగిపోతున్నాయి. ఇక పొగాకు రాయుళ్ళు సిగరెట్ తాగేసి, ఎక్కడపడితే అక్కడ ఆ సిగరెట్ పీకలు పారేస్తుంటారు. కానీ అలా విసిరికొట్టిన సిగరెట్ పీక ఏమవుతుంది? అది భూమిలో డీ కంపోజ్ అవ్వడానికి ఏడాది నుంచి పదేళ్ళు పడుతుంది. అసలే ప్లాస్టిక్ వ్యర్థాలు ఒకపక్క, సిగరెట్ పీకలు మరోపక్క మెల్లిమెల్లిగా పర్యావరణంపై ప్రభావం చూపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజూ టన్నులకొద్దీ సిగరెట్ పీకలు భూమ్మీద పేరుకుపోతున్నాయి. సిగరెట్ తయారీలో సెల్యులోజ్ ఎసిటేట్ అనే నాన్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఫిల్టర్ వాడతారు. అది పర్యావరణానికి అత్యంత ప్రమాదకారి.

ఒక్క ఇండియాలోనే ఏడాదికి తాగి పారేసిన సిగరెట్ పీకల సంఖ్య 100 బిలియన్లు ఉంటుందని అంచనా. బెంగళూరు వంటి నగరంలో రోజుకి కనీసం 31 లక్షల సిగరెట్ పీకలు భూమ్మీద పేరుకుపోతున్నాయి. ఇదే విషయం మీద గుర్గావ్ కు చెందిన విషాల్ కాంత్, నమన్ గుప్త అనే ఇద్దరు స్నేహితులు డీప్ గా స్టడీ చేశారు. ఒకసారి ఏదో పార్టీకి వెళ్ళిన వారిద్దరూ అక్కడ కొన్ని వందల సిగరెట్ ఫిల్టర్లను గమనించిన వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక్క పార్టీలోనే ఇన్ని పీకలుంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇంకెన్ని సిగరెట్ ఫిల్టర్లు ఇలా పేరుకుపోతున్నాయో అని ఆలోచించారు. ఈ వేస్టేజ్ అంతా రీసైకిల్ చేయలేమా అని ఆలోచించి, కోడ్ అనే స్టార్ట్ ప్ ను ప్రారంభించారు. ఈ స్టార్టప్ మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే, తాగిపారేసిన సిగరెట్ ఫిల్టర్లను రీసైకిల్ చేయడం.

ఇంతకీ స్టార్టప్ అయితే ప్రారంభించారు. కానీ సిగరెట్ పీకలు సేకరించటమే ఇబ్బందిగా మారింది. దీంతో ఓ పరిష్కారం కనిపెట్టారు. ఎవరైతే తమకు సిగరెట్ పీకలు కలెక్ట్ చేసి ఇస్తారో, వాళ్లకు కిలోకి ఇంతని చొప్పున కొంత డబ్బు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అలాగే, వీ బిన్స్ అనే పేరుతో పాన్ షాపుల దగ్గర, క్రౌడ్ ఏరియాల్లో డబ్బాలు పెట్టి పీకలు సేకరిస్తున్నారు. షాపుల దగ్గర సిగరెట్ తాగేవాళ్ళు పీకలను ఆ డబ్బాలో పడేలా చేయడం షాప్ అతని బాధ్యత. అలా కిలో పీకలు సేకరిస్తే ఏడువందలు ఇస్తున్నారు. అంత మొత్తంలో కలెక్ట్ కాకపోతే పదిగ్రాములకు వంద రూపాయల చొప్పున ఇస్తారు. ఈ విషయం తెలిసి సిగరెట్ తాగేవాళ్ళు కూడా అడ్డగోలుగా పడేయకుండా ఒకచోట జమచేసి షాపులకు అందచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏమాత్రం హాని కలగకుండా ఈవేస్టేజీనంతా రీసైకిల్ చేస్తున్నారు. ఇద్దరి స్నేహితుల ప్లాన్ ఏమిటంటే ,సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించాలనట. ప్రతిఒక్కరూ ఇలా ఆలోచిస్తే, పర్యావరణానికి వచ్చే ఇబ్బంది వుండదు కదా.

ఇది కూడా చూడండి: కైలాస పర్వతంపై శివుని ఆనవాళ్లు ... బయటపెట్టిన నాసా ... (వీడియో)

ఇది కూడా చూడండి: బాప్ రే , అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయట.?

English summary

recently studied that cigarette filters wastage creates great damage to environmental condition,