ఎందుకా వెంపర్లాట

Cindy Crawford Complaint On Her Husband

09:51 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Cindy Crawford Complaint On Her Husband

భారతీయ వివాహ వ్యవస్థ ఏంటో గొప్పది. ముఖ్యంగా మన వాళ్లకు మాంగల్యం అన్నా, వివాహబంధం అన్నా గౌరవం ఎక్కువే. అయితే సినిమా వాళ్లకు అందునా, హాలీవుడ్‌లో వారికి అదో తంతు మాత్రమే. అయితే అక్కడ కూడా ఈ మధ్య విచిత్రం చోటుచేస్కుందట. అమేమంటే, తనతో ఐదేళ్లు భర్తగా కాపురం చేసినా, అంతక్రితం రెండేళ్లు ప్రియుడిగా గడిపినా, తనపట్ల రవ్వంత అయినా అనురాగాన్ని తన మాజీ భర్త ప్రకటించడం లేదని ఒకప్పటి ప్రముఖనటి సిండీ క్రాఫర్డ్‌ ఇప్పుడు అభిమానులకు అర్జీ పెట్టుకుంటోంది.అసలు విషయం ఏమంటే, ఆమె భర్త కూడా సామాన్యుడేం కాదు. పేరున్న నటుడే. ‘షికాగో’ మ్యూజికల్‌ చిత్రంతో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న రిఛర్డ్‌గెర్‌ మీదే ఆమె ఫిర్యాదు. వాళ్లిద్దరూ 1989 నుంచీ ప్రేమికులుగా కలిసి తిరిగారు. తర్వాత రెండేళ్ల కాలంలో ఒకరికొకరు నచ్చి, 1991లో భార్యాభర్తలు అయ్యారు. నాలుగేళ్లు సజావుగానే కాపురం చేశారు. హాలీవుడ్‌ తీరుకు తగ్గట్లుగా అన్నీ అనుభవించారు. ఇక ఎందుకులే అనుకున్నారో, పరస్పరం మొహమ్మొత్తిందో కానీ, విడాకులు తీసేసుకున్నారు. ఇద్దరూ విడిపోయాక కూడా యావ తగ్గలేదేమో, ఇప్పుడు కనీసం తను ఫోన్‌ చేసినా ఆయన తీయటం లేదని ఆవిడ ఒకటే గొడవ. ‘అర్థంలేని గొడవ ఇది! అతను వద్దునుకునే కదా ఆమెకు విడాకులు ఇచ్చింది. ఆమె తీసుకుంది? ఇప్పుడు మళ్లీ అతని కోసం వెంపర్లాట ఎందుకో ?’మరి. భలే చిత్రం గా వుంది కదూ...!

English summary

Cindy Crawford has spoken candidly about her marriage to Richard Gere, revealing that the actor is 'like a stranger' to her 20 years after their divorce.