'రోబో-2' కి పని చెయ్యను!

Cinematographer Rathnavelu is not working for Robo - 2

06:51 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Cinematographer Rathnavelu is not working for Robo - 2

ఆర్య, జగడం, 1 నేనొక్కడినే వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసిన రత్నవేలు సుకుమార్‌కి మంచి ఆప్తమిత్రుడు. 2010లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన విజువల్‌ వండర్‌ రోబోకి కూడా రత్నవేలు పనిచేశారు. ఆ చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రీసెంట్‌గా సుకుమార్‌ నిర్మాతగా మారి కథ అందించిన 'కుమారి 21 ఎఫ్‌' కి రత్నవేలు పనిచేశారు. రత్నవేలు సుకుమార్‌కి మంచి ఆప్తమిత్రుడు కావడంతో ఈ చిత్రానికి రత్నవేలు ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా చేశారు. ఈ చిత్రం నవంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే శంకర్‌ రోబో-2 ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రోబోకి పనిచేసిన రత్నవేలు రోబో-2 కి కూడా చెయ్యవలసిందిగా శంకర్‌ రత్నవేలుని అడిగారట. కాకపోతే ఆల్రెడీ సెట్స్ పై ఉన్న సూపర్‌స్టార్‌ నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' ఉండటంతో రత్నవేలు రోబో-2 ని సున్నితంగా తిరస్కరిచారట. ఇదే విషయం రత్నవేలుని అడుగగా బ్రహ్మోత్సవం సినిమాతో బిజీగా ఉన్నా, ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ దశ నుంచే సినిమాతో పాటే ట్రావెల్‌ అవ్వాలి. నేను ఒకేసారి రెండు చిత్రాలకి పని చేయలేను, పూర్తిగా ఒకే సినిమా పై దృష్టిపెడతా ఒకటి చేస్తూ ఇంకో దానికి పని చేయలేను. అందుకే రోబో-2 వదులుకోవాల్సి వచ్చింది అని చెప్పారు.

English summary

Cinematographer Rathnavelu is not working for Robo - 2