వీరిద్దరికీ ఏమైంది - అంతలా తిట్టేసుకుంటున్నారు?

Clash Between BharathiRaja An Bala

11:11 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Clash Between BharathiRaja An Bala

సినిమా వాళ్ళూ మనుష్యులే కదా. వారి మధ్యా గొడవలు , వివాదాలు షరా మామూలే .. ఇంతకీ విషయం ఏమంటే, ఇద్దరు గ్రేట్ డైరెక్టర్ల నడుమ వివాదం మొదలై, అది కాస్తా రాజుకుంది. భారతీరాజా.. అంటే తమిళం వరకే కాదు.. సౌత్ ఇండియా మొత్తంలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లో ఒకడు. అలాగే ఇక బాల ఈ తరం డైరెక్టర్లో చాలా గొప్ప పేరు సంపాదించాడు. ఈ ఇద్దరు లెజెండరీ డైరెక్టర్ల మధ్య వివాదం.. మాటల యుద్ధం కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఓ కథ విషయంలో వీరి మధ్య తలెత్తిన గొడవ రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. ఇద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకునే స్థాయికి వివాదం ముదిరి పాకాన పడింది. ఇంతకీ మేటర్ లోకి వెళ్తే,

ఇవి కూడా చదవండి : హీరో వేణు దంపతుల పై కేసు

‘కుట్ర పరంపరై’ అనే పేరుతో భారతీరాజా ఇంతకుముందు ఓ సినిమా మొదలుపెట్టాడు. అయితే అది ముందుకు తీసుకెళ్లలేదు. తాజాగా బాల కూడా ఇదే పేరుతో ఆర్య.. రానాతో పాటుగా ఐదుగురు హీరోల ముఖ్య పాత్రలు గా సినిమా మొదలుపెట్టాడు. తమిళంలో ఓ గొప్ప నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఐతే తాను కూడా అదే కథతో సినిమా తీయాలనుకుంటే.. ఇప్పుడు బాల వచ్చి తన ప్రయత్నానికి అడ్డుపడుతున్నాడని భారతీరాజా విమర్శల కు తెరతీసాడు. తన ఎంగిలిని బాల తినడని భావిస్తున్నానని భారతీరాజా వ్యాఖ్యానించడంతో వివాదం చిరిగి చేటంత అయ్యింది. భారతీరాజాకు తనకు పోరాటం వల్ల ఈ భూమికి ఒరిగేదేమీలేదని.. ఐతే తన కథకు.. భారతీరాజా చేయాలనుకున్న కథకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం ఆయన తెలుసుకోవాలని బాల ప్రెస్ మీట్ పెట్టి మరీ సెలవిచ్చాడు. ఇక భారతీరాజా చేసిన ‘ఎంగిలి’ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇవి పిల్లల మనస్తత్వాన్ని గుర్తుకు తెస్తున్నాయి. వయసు మీద పడుతున్న కొద్దీ కొందరు చిన్న పిల్లల్లా తయారవుతారంటారు' అని బాల ఎద్దేవా చేశాడు భారతీరాజా వ్యాఖ్యలు తన మనసును గాయపరిచాయని.. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించాలన్నది తన అభిమతం కాదని.. ఐతే కొన్ని నిజాల్ని బటయపెట్టాల్సి అవసరం ఉందని అందుకే వివరణ ఇస్తున్నానని బాల తేల్చి చెప్పాడు. మొత్తానికి సీనియర్ , జూనియర్ మధ్య నెలకొన్న ఈ వివాదం ఎటు దారితీస్తుందో మరి .. అసలే తమిళనాట ఎన్నికలాయే.

ఇవి కూడా చదవండి :

ఢిల్లీ భామకు మిస్‌ ఇండియా కిరీటంసంచలనం..

పృధ్వి సూసైడ్ వీడియో

'శృతి' మించి అందాలు ఆరబోసింది(వీడియో)

English summary

Kollywood Directors Bharathi Raja and Director Bala have made some controversial comments on each other. This clash was occured between these two on one movie. Now this became hot topic in Kollywood film industry.