మంచు ఫ్యామిలీ కి-భరణి కి గొడవేంటీ??

Clash between Manchu family and Tanikella Bharani

05:52 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Clash between Manchu family and Tanikella Bharani

కథా ర‌చ‌యిత, డైలాగ్ రైటర్ మరియు న‌టుడు తనికెళ్ల భరణి మంచు విష్ణు పై చేసిన కామెంట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది. అదేంటంటే భరణి సునీల్ తో 'భ‌క్త క‌న్న‌ప్ప' అనే చిత్రాన్ని తెరకెక్కిద్దామని అనుకున్న విషయం తెలిసిందే. దీనికోసం భరణి మొత్తం కధను పూర్తి చేసుకున్న తరువాత కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం మంచు విష్ణు తో చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు నే నిర్మించాలనుకున్నాడు. అంతే కాదు ఈ చిత్రాన్ని బాహుబ‌లి రేంజ్‌లో తీద్దామ‌ని విష్ణు భావించాడు. దీని కోసమై విష్ణు హాలీవుడ్ సాంకేతిక విభాగ నిపుణ‌ల‌తో చ‌ర్చ‌లు కూడా జరిపాడు.

అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంతటి వరకు మొదలు కాలేదు. అసలు ఎందుకు మొదలు కాలేదని అడిగితే అసలు విషయం బయట పడింది. ఈ సినిమా మంచు విష్ణు నిర్మించనుండడంతో ప్ర‌తీ సారి క‌థ‌లో వేలు పెట్ట‌డుతున్నాడ‌ట‌. ఇది మార్చండి అది మార్చండి అంటూ తనికెళ్ల భరణిని తెగ ఇబ్బంది పెట్ట‌డంతో తనికెళ్ళ భరణి ఈ ప్రోజెక్ట్ నుండి సున్నితంగా తప్పుకున్నాడని సమాచారం. ఈ విషయాన్ని భరణి తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతున్నాడట.

English summary

Big Clash between Manchu Mohan Babu family and story writer and actor Tanikella Bharani about Bhaktha Kannappa movie.