రమ్యకృష్ణతో గొడవ పెట్టుకున్న నారా రోహిత్!

Clash between Nara Rohit and Ramya Krishna

03:04 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Clash between Nara Rohit and Ramya Krishna

నారా రోహిత్ ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. అంతే కాదు ఎక్కువ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. నారా రోహిత్ చేతిలో ప్ర‌స్తుతం ఏడెనిమిది సినిమాలు ఉండ‌గా, మ‌రో ఐదారు క‌థ‌ల‌ను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఏ సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడో తెలియనంత బిజీగా ఉన్నాడు నారా రోహిత్. 2016 సంవత్సరంలో ఇప్ప‌టికే మార్చిలో 'తుంట‌రి' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి విజయాన్ని అందుకున్న రోహిత్ మూడు వారాల గ్యాప్‌లోనే ఏప్రిల్‌లో 'సావిత్రి' చిత్రంతో మ‌రోసారి ముందుకొచ్చాడు. ఇక ఈ నెల చివ‌ర్లో లేదా మే మొదటి వారంలో 'రాజా చేయి వేస్తే' సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఇక ఈ యేడాది రోహిత్ న‌టించిన ఐదారు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా కూడా రోహిత్ ఖాతాలో చేరింది. నూతన దర్శకుడు పవన్ మల్లెల తెరకెక్కించబోయే చిత్రంలో నారా రోహిత్ హీరోగా నటించబోతున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించబోతుంది. నారా రోహిత్ – రమ్యకృష్ణ కాంబినేషన్, కథ, కథనం చాలా కొత్తగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ సినిమాతో ర‌మ్య‌కృష్ణ‌తో రోహిత్ పోటీగా న‌టిస్తాడని స‌మాచారం. గ‌తంలో రోహిత్ మావయ్య బాల‌య్య‌కు జోడీగా చాలా సినిమాల్లో న‌టించిన ర‌మ్య‌కృష్ణ‌, రోహిత్ బావ ఎన్టీఆర్‌కు అత్త‌గా కూడా న‌టించి మెప్పించింది. మ‌రి అలాంటి సీనియ‌ర్‌కు రోహిత్ ఎలాంటి పోటీ ఇస్తాడో చూడాలి.

English summary

Clash between Nara Rohit and Ramya Krishna. Nara Rohit latest movie is directing by Pawan Mallela. In this movie Ramya Krishna is playing some negative role. This movie is going on to sets very early.