ఎన్‌టీఆర్-కొరటాల మధ్య వివాదం!!

Clash between Ntr and koratala Siva

03:58 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Clash between Ntr and koratala Siva

యంగ్‌ టైగర్‌ ఎన్‌టీఆర్ 'నాన్నకుప్రేమతో' సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్నాడు. ఎన్‌టీఆర్ తరవాత సినిమా 'జనతా గ్యారేజ్‌' ను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సారధి స్టూడియోస్‌ లో ఒక ఖరీదైన సెట్‌ వేశారు. కానీ ఈ సినిమాలో రెండవ హీరోయిన్‌ ను నిర్ణయించుకోవడానికి తికమక పడుతున్నారు. నిత్యమీనన్‌ ఒక హీరోయిన్‌ గా తీసుకున్నారు. ఇంకో హీరోయిన్‌ కోసం వేట కొనసాగిస్తున్నారు. మొదట్లో కొందరు సమంత అని అన్నారు కానీ ఎన్‌టీఆర్ సమంత తో చేసిన 'రభస' పరాజయం పొందింది. రభస ఓటమి సెంటిమెంట్‌ తో ఎన్‌టీఆర్ సమంతను నిరాకరించాడు.

కాజల్‌, రెజీనా, రాశి ఖన్నా లాంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఎన్‌టీఆర్ మాత్రం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మీద ఆసక్తి చూపిస్తున్నాడు. రకుల్‌ నాన్నకుప్రేమతో సినిమా ద్వారా ఎన్‌టీఆర్ కు హిట్‌ ఇచ్చింది. దీంతో జనతా గ్యారేజ్‌ కి కూడా రకుల్‌ హిట్‌ ఇస్తుందని ఎన్‌టీఆర్ బావిస్తున్నాడట. మరోవైపు డైరెక్టర్‌ కొరటాల శివ మాత్రం శృతిహాసన్‌ పై మొగ్గు చూపుతున్నాడు. 'శ్రీమంతుడు' సినిమాలో శృతిహాసన్‌ నటించింది. ఈ సినిమా భారీ విజయం సాధించింది. కానీ ఎన్‌టీఆర్ శృతిహాసన్‌లు నటించిన 'రామయ్య వస్తావయ్యా' పరాజయం పొందింది. ఎన్‌టీఆర్-శృతిల కాంబినేషన్‌ పై విభిన్న అభిప్రాయం ఉన్నాయి. అయితే ఎన్‌టీఆర్-కొరటాల శివల హీరోయిన్ల యుద్ధంలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

English summary

Clash between Ntr and Director Koratala Siva for heroine selection in Jantha Garage. In this movie their is option for 2 heroines. Till now Nithya Menon is already selected but for main heroine they are searching.