పరుచూరి బ్రదర్స్ మధ్య గొడవలకు కారణాలు ఇవేనా?

Clash between Paruchuri Brothers

04:56 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Clash between Paruchuri Brothers

దిగ్గజ రచయితలు పరుచూరి బ్రదర్స్ ఎన్నో అద్భుతమైన కధలను అందించారు. తెలుగు సినిమాల్లో గొప్ప సినిమాలు లిస్టు చేసి పక్కన పెడితే టాప్ ఫైవ్ సినిమాల్లో వీరివి కూడా తప్పకుండా ఉంటాయి. అయితే స్క్రిప్ట్ రాసే సమయంలో క్యారెక్టర్ల కంటే వీరే ఎక్కువగా గొడవపడతారట. ఆ క్యారెక్టర్ అలా మాట్లాడొద్దు, ఇలానే ఉండాలి. అతను ఆమెనెందుకు రేప్ చేయాలి? వద్దు అని గొడవ పడతారట. కొన్నిసార్లు పేపర్లు చించేయడం, ఫైల్స్ విసరేసి అలిగి వెళ్లిపోవడం కూడా జరగుతుందట. అయినా సరే మళ్లీ సమయానికి వచ్చి స్క్రిప్ట్ మీద కూర్చుని ఎవరో ఒకరు కన్విన్స్ అవుతారట.

ఈ విషయాలను డైరెక్టర్ బి. గోపాల్ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పుకొచ్చారు. తనకు ఒక కథ కావాలని వెళ్తే ఇద్దరూ తిట్టుకుని, పేపర్లు విసిరేసుకుని వెళ్లిపోయారట. ఆ తర్వాతే ఆయనకు అర్ధమైందట. కథను అంత గొప్పగా ఫీలవుతారు కాబట్టే మంచి సినిమాలు వస్తాయట. కానీ సినిమాలు పూర్తయ్యాక మాత్రం ఏరా పెద్దోడా! ఏరా చిన్నోడా అని కలిసిపోతారట. సినిమా ఫెయిలైతే మాత్రం మళ్లీ దానిమీద చర్చించుకుని, తప్పు ఎక్కడ జరిగిందని బేరీజు వేసుకుంటారట. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను బి. గోపాల్ బాగా విసిగిచ్చాడట. ఏది చెప్పినా బాగోలేదంటే నీకు ఎలాంటి సినిమాలు కావాలి? నీకు నచ్చిన సినిమాల పేర్లు చెప్పమని అన్నారట.

అప్పుడే కోపంలో నాకు మంచి కథ కావాలి, అనాలోచితంగా గుండమ్మ కథకు, దుష్మన్ కథను కలుపుతారా అనగా? సరేనంటూ విజయేంద్ర ప్రసాద్ వెళ్లిపోయాడట. అలా నోటికొచ్చింది చెప్పినా సమరసింహారెడ్డి బ్రహ్మాండమైన కథను తీసుకొచ్చారట విజయేంద్రప్రసాద్. రచయితలతో తన అనుభవాన్ని బి గోపాల్ ఇలా వివరించారు.

English summary

Clash between Paruchuri Brothers