తాళం పడింది

Clash In Congress Party In Anantapuram

01:04 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Clash In Congress Party In Anantapuram

అసలే ఎపిలో కాంగ్రెస్ పరిస్థతి బాలేదు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కి మరిన్ని దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా కర్నూలు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి బుధవారం ఉదయం తాళం పడింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అనుచరులే పార్టీ కార్యాలయానికి తాళం వేసేసినట్లు భావిస్తున్నారు. మంగళవారం అనంతపురం జిల్లాలో రాహుల్‌గాంధీ పర్యటన సందర్భంగా వేదిక పైకి వస్తున్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని రాహుల్‌ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్యప్రకాశ్‌రెడ్డి అక్కడి నుంచి నిష్క్రమిచేసారు. నిన్న సాయంత్రం నుంచి సూర్యప్రకాశ్‌రెడ్డి తన సెల్‌ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసి ఇంట్లోనే ఉండిపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో, ఇది కోట్ల అనుచరుల పనేనని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మొత్తానికి పెద్ద నాయకుల పర్యటన పార్టీకి జవసత్వాలు నింపాలే గానీ ఇలా మరిన్ని ఇబ్బందుల్లో నెట్టేస్తే ఎలా అనే గుసగుసలు విన్పిస్తున్నాయి.

English summary

On Tuesday All India Congress Committee Vice President Rahul Gandhi Visit Sri Satya Sai Temple and conducted a meeting in Anantapuram . In that meeting Rahul Gandhi Security were not allowed Ex-Minister Kotla Surya Prakash and due to this incident his followers get worried and lock the congress party office in Ananthapuram