పాపం 'దానం'...!!!

Clashes In Telangana Congress Party

02:41 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Clashes In Telangana Congress Party

కాంగ్రెస్ అధికారంలో వున్నా లేకున్నా కాంగ్రెస్ వాళ్ళది ఒకేదారి అన్నట్టుగా వుంది వాళ్ళ వ్యవహారం. ఘర్షణలు ఆపార్టీకి కొత్తకాదని మరోసారి రుజుచేసింది. గడిచిన ఎన్నికల్లో ఎపిలో ఆపార్టీ తుడిచి పెట్టుకుపోగా , తెలంగాణాలో ప్రతిపక్షానికి పరిమితమైంది. అయినా తెలంగాణాలో కాంగ్రెస్ నేతలమధ్య పొర పోచ్చాయలు , వర్గ పోరు ఆగలేదు. అసలే వనగల్ ఉపఎన్నికలో డిపాజిట్ కోల్పోయి, మరోపక్క నేతలు టి ఆర్ ఎస్ లోకి వలసపోతుంటే , దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నా ఆ పార్టీలో పరిస్థితి మారడంలేదు.

తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు. అది కూడా కాంగ్రెస్ 131వ వార్షిక వేడుకల నేపధ్యంలో కావడం విశేషం. అసలే గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో బాహాబాహీ కి దిగడం నివ్వెర పరుస్తోంది.

వివరాల్లోకి వెళితే , ఉప్పల్ లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు దానం నాగేందర్ హాజరయ్యారు. దీంతో రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు కోపం వచ్చేసింది. దానం గ్రేటర్ కే పరిమితమని , రంగారెడ్డి కి రావద్దని నినాదాలు చేస్తూ ,దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాలు కోడి గుడ్లు , టమోటా లతో దాడి చేసుకున్నారు. తీవ్రంగా ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో ఆవిర్భావ వేడుకలు రసా భాస అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

గ్రేటర్ అధ్యక్షుడుగా దానం వ్యవహరిస్తుంటే , రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా మల్లేష్ గౌడ్ వున్నారు. మొత్తానికి రెండు వర్గాల మధ్య సాగిన 'దాడుల యవ్వారం ' చూసిన వాళ్ళు మాత్రం వీళ్ళు ఇంతే అనుకున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందో , భవిష్యత్తులో మరిన్ని ఘటనలకు దారితీస్తుందో చూడాలి.

English summary