'నేను-శైలజ' కి క్లీన్‌ 'యూ'

Clean U certificate for Nenu-Sailaja

05:57 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Clean U certificate for Nenu-Sailaja

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ నటించిన తాజా చిత్రం 'నేను-శైలజ'. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ సరసన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్‌ నటించింది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ రప్పించుకుంది. ఇప్పుడు తాజాగా సెన్సార్‌ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్‌లు లేకుండా క్లీన్‌ 'యూ' సర్టిఫికేట్‌ సెన్సార్‌ బోర్డు నుండి లభించింది. స్రవంతి రవి కిషోర్‌ నిర్మించిన ఈ చిత్రం న్యూఇయర్‌ కునుకగా జనవరి 1న విడుదలవుతుంది.

English summary

Clean U certificate for Nenu-Sailaja movie. Ram and Keerthi Suresh are pairing in this movie. kishore Tirumala is directed this movie.