ఆండ్రాయిడ్ డివైస్‌లకు క్లిక్‌జాకింగ్‌ ప్లాబ్లెమ్..

Clickjacking Problem to Android Device users

05:13 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Clickjacking Problem to Android Device users

ఆండ్రాయిడ్ డివైస్ యూజర్లను కొత్త మాల్ వేర్ టెన్షన్ పెడుతోంది. అయితే లాలిపాప్, మార్ష్‌మాలో కాకుండా ఇతర పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు వాడుతున్న వారిని ఇది కంగారు పెడుతోంది. ఎందుకంటే ఓ కొత్త ఆండ్రాయిడ్ మాల్‌వేర్ ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతోంది. మొబైల్ సెక్యూరిటీ సంస్థ స్కైక్యూర్ ఈ విషయాన్ని వెల్లడించింది. యాక్సెస్సబిలిటీ క్లిక్‌జాకింగ్‌గా పిలవబడుతున్న ఈ మాల్‌వేర్ యూజర్ ఆన్‌లైన్‌కు కనెక్ట్ అయి గేమ్ ఆడుతున్న సమయంలోనో, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలోనో ఓ డైలాగ్ బాక్స్‌ను స్క్రీన్‌పై ప్రత్యక్షం చేస్తుంది. దీనిపై యూజర్లు క్లిక్ చేస్తే ఆ మాల్‌వేర్ డివైస్‌లోకి వ్యాప్తి చెందుతుంది. అనంతరం యూజర్‌కు తెలియకుండానే వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి హ్యాకర్లకు చేరవేస్తుంది. దీన్ని నివారించాలంటే నూతన ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ కావడమో లేదా మొబైల్ సెక్యూరిటీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడమో చేయాలని సదరు స్కై క్యూర్ హెచ్చరిస్తోంది.

English summary

Mobile security company Skycure had found that a new Android malware that allows the attacker to hack all the information of the user without the user permission.Upto now 500,000,000 Android devices affected by this malware.