సీఎం సెక్యూరిటీ నుంచి క్లౌడ్ స్పేస్ యాప్‌

Cloud Space App From CM Security

01:41 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Cloud Space App From CM Security

మీ స్మార్ట్‌ఫోన్ లో ఫొటోలు, కాల్ లాగ్స్, కాంటాక్ట్ డిలీట్ అయిపోయాయా? అయితే నో టెన్షన్. ఎందుకంటే మీకోసమే ఓ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో మీ సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు. క్లౌడ్ స్పేస్ ఆఫ్ సీఎం సెక్యూరిటీ పేరిట ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ లభిస్తోంది. దీని ద్వారా డివైస్‌లో ఉన్న ముఖ్యమైన ఫొటోలు, కాంటాక్ట్‌లతోపాటు కాల్స్ హిస్టరీ సమాచారాన్ని, ఎస్‌ఎంఎస్‌లను క్లౌడ్ స్టోరేజ్‌లోకి బ్యాకప్ తీసుకోవచ్చు. ఒకవేళ డివైస్ పనిచేయకపోయినా, సదరు సమాచారం డిలీట్ అయినా వేరే డివైస్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని యూజర్ ఐడీతో లాగిన్ అయితే వినియోగదారులు తమ సమాచారాన్నంతా ఒకే ఒక్క టచ్‌తో తిరిగి పొందేందుకు వీలుంది.

English summary

A new cloud space app released by CM security app. With the help of this security app we can back up our messages , contacts,gallery,etc