ఇడ్లీ రేటుపై ఏపీ మంత్రి కి ఆగ్రహం వచ్చింది

C.M angry on Sujata Hotel management in Anantapur

10:52 AM ON 9th December, 2016 By Mirchi Vilas

C.M angry on Sujata Hotel management in Anantapur

అన్ని రేట్లూ పెరిగిననట్లే, హోటల్స్ లో టిఫిన్స్ రేట్లు కూడా ఠారెత్తి పోతున్నాయి. మినపప్పు రేటు మండిపోతున్న నేపథ్యంలో ఇడ్లీ కొనాలంటే భయం వేస్తోంది. ఇక ఒక ఇడ్లీ 18 రూపాయలా అంటూ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె బుధవారం అనంతపురం నగరంలోని పలు దుకాణాలు, చౌకడిపోలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె వెంట జేసీ లక్ష్మీకాంతం, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కమలానగర్ లో పాత సుజాత హోటల్ ను మంత్రి పరిశీలించారు. అక్కడ ఉన్న వినియోగదారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ఈ హోటల్లో ధరలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. అప్పుడు మంత్రి నిర్వాహకులను పిలిచి అడిగారు. ఒక ఇడ్లీ 18 రూపాయలా... బోర్డుపై ఐటమ్స్ రాశారు.. ధరలు రాయలేదే అని ప్రశ్నించారు. ఈ హోటల్ యాజమాన్యానికి ఫైన్ వేయాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతంకు ఆదేశించారు.

అటునుంచి రఘువీరా టవర్స్ లో ఉన్న శోభా శారీస్ సెంటర్ , సప్తగిరి సర్కిల్ లోని బుచ్చయ్య స్వీట్ స్టాల్ పక్కన ఉన్న గార్మెంట్ షాపులను ఆమె పరిశీలించారు. నగదు కొరత వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారాలు ఎలా ఉన్నాయి... స్వైపింగ్ మిషన్లు వినియోగిస్తున్నారా... లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వైపింగ్ మిషన్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అలాగే పాతూరులోని నాలుగు రేషన్ షాపులను మంత్రి పరిశీలించారు. ఎంత మంది లబ్ధిదారులకు సరుకులు సరఫరా చేశారు. క్యాస్ లెస్ కింద అందించారా... లేదా స్టాక్ ఎంత మిగులు ఉంది తదితర వివరాలను పరిశీలించారు. అదే విధంగా స్వైపింగ్ మిషన్లు వినియోగిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: సీఎం పదవిలో ఉంటూ కన్నుమూసిన వాళ్ళు వీళ్ళే

ఇది కూడా చదవండి: ఆఫీస్ లో లేడీ బాస్ కంటే మెన్ బాస్ ఉంటే కలిగే ప్రయోజనాలు...

ఇది కూడా చదవండి: వేప పొగతో వైరస్ మాయం - అంతేకాదు ...


English summary

Andra Pradesh Chief minister Chandrababu Naidu angry on Sujata Hotel management in Anantapur. Because of one idly cost 18 rupees.