సహాయ చర్యలకు సిఎం ఆదేశం

CM Chandrababu Naidu Ordered for Rescue Operations

05:43 PM ON 17th November, 2015 By Mirchi Vilas

CM Chandrababu Naidu Ordered for Rescue Operations

తుఫాను కారణంగా భారీ వర్షాలకు అతలాకుతలమైన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హుదూద్‌ తుఫాన్‌ మాదిరిగా బాధితులకు బియ్యం, కిరోసిన్‌ పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. వర్షాల కారణంగా మరణించిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడిన చోట ఇసుక బస్తాలతో తక్షణం పూడ్చాలని సిఎం ఆదేశించారు. కడప జిల్లాలో వరదలో చిక్కుకున్న వారిని కాపాడాలని ఆదేశించారు.

English summary

CM Chandrababu Naidu Ordered for Rescue Operations