తెర మీదికి భువనేశ్వరి 

CM Wife Active Role

01:34 PM ON 11th January, 2016 By Mirchi Vilas

CM Wife Active Role

తెరవెనుక వుండే, ఎన్టిఆర్ గారాల పట్టి ఈ మధ్య వేదిక లెక్కుతున్నారు. అదేనండీ ఎపి సిఎమ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. గత ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో గోదావరి నిత్య హారతి ప్రారంభించడానికి ఈమె కారణం. కాశిలో నిత్యం గంగా హారతి మాదిరిగా గోదావరికి నిత్య హారతి ఇస్తే బాగుంటుందని భువనేశ్వరి కోరిన విషయాన్ని పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు కూడా. పుష్కరాల్లో భర్తతో కల్సి పుష్కర స్నానం చేసి , హారతి తిలకించారు.

అంతేకాదు రాజకీయ కార్యకలాపాల్లో కూడా చురుగ్గానే కనిపిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఓ గ్రామాన్ని కూడా భువనేశ్వరి దత్తత తీసుకున్నారు. జనచైతన్య యాత్రలో కూడా ఈమె కనిపించారు. ఇప్పుడు తన తండ్రి ఎన్ టి ఆర్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రక్త దాన శిబిరాలు నిర్వహించనున్న విషయాన్ని ఆమె ప్రకటించారు.

ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ అందరికీ ఆరాఢ్యుడైన ఎన్టీఆర్‌ కూతురిగా పుట్టడం తన అదృష్టమని అన్నారు. ఈనెల 18న ఎన్టీఆర్‌ 20వ వర్ధంతి సందర్భంగా రెండు రాష్ట్రాల్లో 200 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

ఓ పక్క భర్త చంద్రబాబు సిఎమ్ గా వ్యవహరిస్తుంటే, సోదరుడు - వియ్యంకుడు అయిన బాలకృష్ణ ఎం ఎల్ ఎ గా వున్నారు. ఇక ఏకైక పుత్రుడు నారా లోకేష్ టిడిపి జాతీయ కార్యదర్శిగా అన్నింటా దూసుకుపోతూ, భవిష్యత్ సిఎమ్ గా పార్టీ శ్రేణుల్లో ప్రచారం పొందుతున్నాడు. కోడలు బ్రాహ్మణి కూడా ఎన్ టి ఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అందుకే తాను సైతం అన్నట్లు భువనేశ్వరి కూడా ఆయా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. కాగా మనవడు దేవాన్ష్ ఇప్పటికే వార్తల్లో కెక్కాడు. మొత్తానికి నారా వారి ఫేమిలీ అన్నింటా దూసుకు వెడుతోంది.

English summary

Andhra Pradesh Cheif Mnister Chandrababu Naidu's Wife Plays active Role in Andhra Pradesh Politics. She used to be in news recent days