ఆ వార్త చదువుతూ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్(వీడియో)

CNN anchor cried in live news

06:02 PM ON 24th August, 2016 By Mirchi Vilas

CNN anchor cried in live news

ఆ యాంకర్ లైవ్ లో ఓ వార్త చదువుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకీ ఆమెను అంతగా కలిచివేసిన ఆ వార్త ఏమిటి? ఆ వివరాల్లోకి వెళితే.. సిరియాలో పుట్టగానే బాంబుల దాడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవాలి. లేదంటే బతుకు లాగించడం కష్టం. పిల్లలతో కలిసి ఆటలాడుకోవాల్సిన సమయంలో రక్తపుటేర్ల మధ్య భయంభయంగా బతుకీడ్చాల్సిన భయంకర దుస్థితి. పుట్టిన దగ్గర నుండి రక్తపాతాన్ని చూడటం చిన్న పిల్లలకు కూడా అలవాటుగా మారింది. అందుకే కంటి ముందే కన్నవారు చనిపోయినా.. ఓ చిన్నారికి రక్తం కారుతున్నా.. నొప్పి తెలియలేదు. ఒక్క కన్నీటి చుక్క రాలలేదు. ఆ చిన్నారి పేరు ఒమ్రాన్ దక్నీష్. వయసు 5 ఏళ్ళు.

సిరియాలోని అలెక్ర్పోలో జరిగిన బాంబుదాడిలో తనవారంతా కళ్లముందే ప్రాణాలు కోల్పోయి.. తనతో పాటు 12 మంది చిన్నారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. రక్తం కారుతున్న ముఖాన్ని తుడుచుకుంటూ ఇంతకన్నా ఈ ప్రపంచం ఏం ఇవ్వగలదులే? అన్న నిర్వేదం ఆ కళ్లలో కనిపిస్తుంది. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోని అంబులెన్స్ బృందాలు వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించాయి. ఈ ఘటనను కళ్లకు కడుతూ న్యూస్ చదివిన సీఎన్‌ఎన్ యాంకర్ ఉద్వేగాన్ని ఆపుకోలేక.. ఆ చిన్నారి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఒకసారి ఆ వీడియోను మీరు కూడా చూడండి.

English summary

CNN anchor cried in live news