రెండేళ్ళుగా ఆ ప్లేయర్ పై కోచ్ అత్యాచారం

Coach Booked For Sexual Harassment In Rajasthan

11:19 AM ON 20th December, 2016 By Mirchi Vilas

Coach Booked For Sexual Harassment In Rajasthan

అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని మరో ఘటన రుజువుచేస్తోంది. మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాల్సిన కోచ్ అందుకు విరుద్ధంగా పైశాచిక చర్యలకు దిగుతున్నాడు. ఇందులో భాగంగా ఓ క్రీడాకారిణిపై రెండేళ్ళుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడట. ఇక లాభం లేదని బాధితురా లు పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో అతగాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివారాల్లోకి వెళ్తే,

రాజస్థాన్ కోటాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని రెండేళ్ళుగా స్కూల్ తరుఫున హ్యాండ్ బాల్ ఆడుతోంది. 40 ఏళ్ళ అబ్దుల్ హనీఫ్ పీటీఐగా వ్యవహరిస్తున్నాడు. టోర్నీల సందర్భంగా పలు ఊర్లకు తీసుకెళ్ళినప్పుడు హోటల్ గదిలో ఆమెను లొంగదీసుకునేవాడు. చివరకు ఆ బాలిక ఆదివారం ఈ విషయాన్ని బయటపెట్టింది. రెండేళ్ళలో ఏడేనిమిదిసార్లు తనపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ఇది కూడా చూడండి: ఇలా చేస్తే రెండు రోజుల్లోనే బట్టతల పై హెయిర్ రీగ్రోత్ మొదలవుతుంది

ఇది కూడా చూడండి: బ్లడ్ గ్రూప్ తెలిస్తే మీ మనస్తత్వతం ఇట్టే చెప్పేయొచ్చు

ఇది కూడా చూడండి: ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ

English summary

Coach Booked For Sexual Harassment In Rajasthan