వేదిక మీద కాటేసిన పాము.. అయినా పాడుతూ ప్రాణాలు వదిలింది

Cobra bitten a Pop singer Irma Bule on stage

04:26 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Cobra bitten a Pop singer Irma Bule on stage

వినడానికే భయం గొల్పుతోంది. ఇక చూసిన వాళ్ళు షాక్ అయ్యారు... ఆ పరిసరాల్లో నిశబ్ధ వాతావరణం రాజ్యమేలింది.... ఓ కుటుంబంలో విషాదం అలుముకుంది... అందరినీ కలచివేసింది ఈ ఘటన. వేదిక మీద పాటలు పాడుతూ.. మధ్యమధ్యలో పాములతో విన్యాసాలు చేయడం ఆ పాప్‌సింగర్ అలవాటు. ఇలాగే తాజాగా వేదిక మీద పాట పాడుతున్న ఆ గాయని తొడ పై పాము కాటేసింది. అయినా తన ప్రదర్శన ఆపని ఆ పాప్‌సింగర్ 45 నిముషాలు పాటు ఏకధాటిగా ప్రదర్శన ఇచ్చి.. ఆ తర్వాత వేదిక మీదే ప్రాణాలు విడిచింది. ఇండోనేషియాకు చెందిన 29 ఏళ్ల పాప్ సింగర్ ఇమ్రా బులె విషాదాంతమిది.

ఇది కూడా చదవండి: బాలయ్య కోసం పేరు మార్చుకున్న చిన్నారి

పూర్తి వివరాల్లోకి వెళ్తే, వెస్ట్‌ జావాలోని కారవాంగ్ గ్రామంలో ఆమె ఇటీవల ప్రదర్శన ఇస్తుండగా ఈ దారుణం జరిగింది. వేదిక మీద పాటలు పాడుతూ మధ్యమధ్య పాములతో విన్యాసాలు చేయడం ఇమ్రా స్పెషాలిటీ. ఆమె షోలో విషపూరితమైన నాగుపాములు, కొండచిలువలను ఉపయోగించి విన్యాసాలు చేసేవారు. కానీ గత ప్రదర్శనలో ఆమెను విషపూరితమైన 'రియాంటీ' అనే పాము కాటేసింది. ఆమె తొడ పై కాటు వేసింది. దీంతో చకచకా విషం రక్తంలోకి చేరిపోయింది. అయితే పాములను ఆడించే వ్యక్తి వెంటనే దానిని వెనక్కి లాగినా ఫలితం లేకపోయింది. అయితే పాము కాటేసిన తర్వాత కూడా తన గానంతో 45 నిమిషాలపాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆమె..

ఇది కూడా చదవండి: ఫేస్‌బుక్ చాటింగ్ లోఅబధ్ధాలు చెప్పేది ఎవరో తెలుసా?

ఆ తర్వాత వాంతులు చేసుకుంటూ వేదిక మీద కుప్పకూలిపోవడంతో, పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. దీంతో అక్కడ విషాదం అలుముకుంది.

ఇది కూడా చదవండి: ఛీ ఛీ.. ఐఏఎస్ ఇంట్లో టీవీ తారల వ్యభిచారం

English summary

Cobra bitten a Pop singer Irma Bule on stage. Pop singer Irma BUle bitten up by Cobra snake on stage.