క్యూలో నిలబడే వారికి ఉచితంగా కోకాకోలా డ్రింక్స్!

Cocacola giving free drinks for people

11:55 AM ON 15th November, 2016 By Mirchi Vilas

Cocacola giving free drinks for people

మహాశివరాత్రికి వచ్చే భక్తులకు, పుష్కరాలకు వచ్చే యాత్రికులకు వివిధ సంస్థలు, వ్యక్తులు సాయం అందించడం, వితరణ కార్యక్రమాలు చేయడం తెల్సిందే. అయితే, నగదుకోసం బ్యాంకుల వెంట గంటల కొద్ది పడిగాపులు పడుతున్న దేశ ప్రజలకు చల్లటి కబురు ఇది. అన్ని బ్యాంక్ ల వద్ద మూడు రోజుల పాటు ఉచితంగా కూల్ డ్రింక్ సరఫరా చేయాలని కోకాకోల కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. డబ్బు కోసం రోజంతా క్యూ లైన్లలో నిలబడి విసిగిపోతున్న ఖాతాదారులకు చల్లచల్లగా శీతలపానియాన్ని అందించాలని నిర్ణయించారు. నెల్లూరు వేదాయపాలెం సెంటర్ లోని ఎస్బీఐ దగ్గర కోకాకోల ప్రతినిధులు చల్లటి పానియాన్ని పంపీణీ చేశారు.

దీనిపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గంటలకోద్ది క్యూలో అలసిపోయిన తమకు ఈ కూల్ డ్రింక్ ఉపశమనం ఇస్తోందని వారు అంటున్నారు. డబ్బు విత్ డ్రా కోసం బ్యాంక్ ల వద్ద పడిగాపులు పడుతున్నా ప్రజలకు సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ప్రతినిధులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కోకాకోల ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో మంచి స్పందన వస్తోందని వారు తెలిపారు. 16వ తేదీ వరకు ఉచితంగా కూల్ డ్రింక్ పంపీణీ చేస్తామని కోకాకోల ప్రతినిధులు చెబుతున్నారు.

English summary

Cocacola giving free drinks for people